జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కశ్మీర్‌లో భారీ చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ అడ్డకుంది. ఉత్తర కశ్మీర్‌లోని కెరన్ సెక్టార్‌ గుండా ఇండియాలోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు.

news18-telugu
Updated: April 6, 2020, 7:48 AM IST
జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూ కశ్మీర్‌లో భారీ చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ అడ్డకుంది. ఉత్తర కశ్మీర్‌లోని కెరన్ సెక్టార్‌ గుండా ఇండియాలోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు. ఆదివారం నాడు జరిగిన ఈ దాడిలో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. అయితే.. ఈ క్రమంలో మరో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. సైనికుల్లో సుబేదార్ సంజీవ్ కుమార్(హిమాచల్ ప్రదేశ్), హవల్దార్ దేవేంద్ర సింగ్(ఉత్తరాఖండ్), పారా ట్రూపర్ బాలకృష్ణన్(హిమాచల్ ప్రదేశ్), పారా ట్రూపర్ అమిత్ కుమార్(ఉత్తరాఖండ్), ఛత్రపాల్ సింగ్(రాజస్థాన్) అమరులయ్యారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 6, 2020, 7:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading