Fit India : ఫిట్ ఇండియా... నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Fit India : నేడు జాతీయ క్రీడా దినోత్సవం. అలాగే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జరిగే జయంత్యుత్సవాలను పురస్కరించుకొని... ప్రధాని మోదీ నేడు ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇవ్వబోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 29, 2019, 6:14 AM IST
Fit India : ఫిట్ ఇండియా... నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
నరేంద్ర మోదీ(File)
  • Share this:
ఒక దేశం అభివృద్ధి చెందాలంటే... ఆ దేశంలో ప్రజలు ఫిట్‌గా ఉండాలి. కొడితే గోడలు బద్ధలైపోయేలా... బలంగా ఉండాలి. అప్పుడే రికార్డులు బద్ధలవుతాయి. సరికొత్త చరిత్ర లిఖించగలం. ఇదే స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ నేటి ఉదయం 10 గంటల నుంచీ 11 గంటల వరకూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో ప్రధానంగా జాతీయ క్రీడా దినోత్సవం, ఫిట్ ఇండియాపై మాట్లాడతారు. సాధారణంగా మనమంతా... ఫిట్‌గా ఉండటమనేది క్రీడాకారులు, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తుంటాం. నిజానికి ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలి. రోజూ వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్ వంటివి చెయ్యాలి. ఒంట్లో అనవసరంగా ఉన్న కొవ్వు, అధిక బరువును తొలగించుకోవాలి. అందుకోసం ఉద్దేశించినదే ఫిట్ ఇండియా ఉద్యమం.

మన అదృష్టమేంటంటే... ఈమధ్యకాలంలో ఫిట్‌గా ఉండాలనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఇదివరకు సిటీలకే పరిమితమైన ఈ ఆలోచన ఇప్పుడు పట్టణాలకు కూడా విస్తరించింది. చాలా మంది ఉదయాన్నే లేచి... వాకింగో, జాగింగో చేస్తున్నారు. కుర్రాళ్ల నుంచీ ముసలివాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందువల్లే సిటీలు, పట్టణాల్లో ఇప్పుడు రకరకాల జిమ్‌లు సందడి చేస్తున్నాయి. సెలబ్రిటీలైతే ప్రత్యేక ట్రైనర్‌లను నియమించుకొని ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు. కొందరైతే విదేశీ ట్రైనర్లను కూడా మెయింటేన్ చేస్తున్నారు.

ఇదీ ఫిట్‌ ఇండియా ఉద్యమం : యూత్ ఫిట్‌గా ఉంటేనే దేశం ఫిట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇస్తున్నారు. ఇందుకు జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్ట్ 29ని ఎంచుకున్నారు. హాకీ కింగ్ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజు సందర్భంగా... జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఇవాళ జరుపుకుంటున్నాం. ఇదే రోజున రాజీవ్ ఖేల్ రత్న, అర్జున వంటి అవార్డుల్ని బహుకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మోదీ... ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఫిట్ నెస్ పై ప్రతిజ్ఞ చేయిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులు ఈ ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. ఇందులో విద్యార్థులతోపాటూ టీచర్లు, నేతలు, ప్రజలు కూడా పాల్గొనాలన్నది ప్రధాని పిలుపు.

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ప్రపంచ క్రికెట్‌లో ది బెస్ట్ ఫిట్‌నెస్ ఆటగాడు. అతన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే శ్రద్ధ పెరగడంతో... ఫిట్‌నెస్‌పైనా దృష్టి పెడుతుండటం మంచి పరిణామం.
First published: August 29, 2019, 6:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading