Fit India : ఫిట్ ఇండియా ఉద్యమం... ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

Fit India Movement : నేడు జాతీయ క్రీడా దినోత్సవం. అలాగే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జరిగే జయంత్యుత్సవాలను పురస్కరించుకొని... ప్రధాని మోదీ ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 29, 2019, 10:23 AM IST
Fit India : ఫిట్ ఇండియా ఉద్యమం... ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఫిట్ ఇండియా (Image : Twitter - ANI)
Krishna Kumar N | news18-telugu
Updated: August 29, 2019, 10:23 AM IST
Fit India Campaign : ఒక దేశం అభివృద్ధి చెందాలంటే... ఆ దేశంలో ప్రజలు ఫిట్‌గా ఉండాలి. కొడితే గోడలు బద్ధలైపోయేలా... బలంగా ఉండాలి. అప్పుడే రికార్డులు బద్ధలవుతాయి. సరికొత్త చరిత్ర లిఖించగలం. ఇదే స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ... ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిట్ ఇండియా ప్రచారం ప్రారంభించారు. సాధారణంగా మనమంతా... ఫిట్‌గా ఉండటమనేది క్రీడాకారులు, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తుంటాం. నిజానికి ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలి. రోజూ వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్ వంటివి చెయ్యాలి. ఒంట్లో అనవసరంగా ఉన్న కొవ్వు, అధిక బరువును తొలగించుకోవాలి. అందుకోసం ఉద్దేశించినదే ఫిట్ ఇండియా ఉద్యమం.


మన అదృష్టమేంటంటే... ఈమధ్యకాలంలో ఫిట్‌గా ఉండాలనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఇదివరకు సిటీలకే పరిమితమైన ఈ ఆలోచన ఇప్పుడు పట్టణాలకు కూడా విస్తరించింది. చాలా మంది ఉదయాన్నే లేచి... వాకింగో, జాగింగో చేస్తున్నారు. కుర్రాళ్ల నుంచీ ముసలివాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందువల్లే సిటీలు, పట్టణాల్లో ఇప్పుడు రకరకాల జిమ్‌లు సందడి చేస్తున్నాయి. సెలబ్రిటీలైతే ప్రత్యేక ట్రైనర్‌లను నియమించుకొని ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు. కొందరైతే విదేశీ ట్రైనర్లను కూడా మెయింటేన్ చేస్తున్నారు.




ఇదీ ఫిట్‌ ఇండియా ఉద్యమం : యూత్ ఫిట్‌గా ఉంటేనే దేశం ఫిట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇస్తున్నారు. ఇందుకు జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్ట్ 29ని ఎంచుకున్నారు. హాకీ కింగ్ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజు సందర్భంగా... జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఇవాళ జరుపుకుంటున్నాం. ఇదే రోజున రాజీవ్ ఖేల్ రత్న, అర్జున వంటి అవార్డుల్ని బహుకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మోదీ... ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ప్రపంచ క్రికెట్‌లో ది బెస్ట్ ఫిట్‌నెస్ ఆటగాడు. అతన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే శ్రద్ధ పెరగడంతో... ఫిట్‌నెస్‌పైనా దృష్టి పెడుతుండటం మంచి పరిణామం.
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...