FIRST TIME IN INDIAN LOK SABHA ELECTION HISTORY COMPARING VVPAT SLIPS AND EVM VOTES MS
భారత లోక్‌సభ ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి ఇలాంటి ప్రక్రియ..
ప్రతీకాత్మక చిత్రం
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.11% ఓటింగ్ నమోదైంది. దాదాపుగా 99కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు నమోదైన ఓటింగ్‌లో ఇదే అత్యధికం.
దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు నేడు వెల్లడి కానుంది. దేశాన్ని, రాష్ట్రాలను ఏలే పార్టీలేవో.. ప్రజా తిరస్కరణను మూట గట్టుకున్న పార్టీలేవో నేటి ఫలితాలతో తేలిపోనుంది. దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఫలితాల వెల్లడిలో భాగంగా మొదట అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8గం.కు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8.20గం. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభిస్తారు.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్ స్లిప్స్‌ను లెక్కించనున్నారు. ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ ఓట్లకు వ్యత్యాసం కనిపిస్తే.. వీవీప్యాట్ ఓట్లను పరిగణలోకి తీసుకోనున్నారు. వీవీప్యాట్ స్లిప్స్‌ను ఈవీఎంలతో సరిపోల్చడం భారత సార్వత్రిక ఎన్నికల్లో ఇదే మొట్టమొదటిసారి.సుప్రీం ఆదేశాల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగిన 10.3లక్షల కేంద్రాల్లో.. 20,600 కేంద్రాల్లో వీవీప్యాట్లను లెక్కించనున్నారు.
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.11% ఓటింగ్ నమోదైంది. దాదాపుగా 99కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు నమోదైన ఓటింగ్‌లో ఇదే అత్యధికం. కౌంటింగ్ మొదటి దశలో పోస్టల్ బ్యాలెట్, చివరలో వీవీప్యాట్ స్లిప్స్‌ను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.