తొలిసారి.. 24 గంటల్లో 7వేల కేసులు.. ఇండియాలో దారుణంగా వ్యాపిస్తున్న కరోనా..

గత 24 గంటల్లోనే 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం.. 24 గంటల్లో 7466 కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: May 29, 2020, 9:31 AM IST
తొలిసారి.. 24 గంటల్లో 7వేల కేసులు.. ఇండియాలో దారుణంగా వ్యాపిస్తున్న కరోనా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కకావికలం చేస్తోంది.. రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తోంది.. గత పది, పదిహేను రోజులుగా ఆరు వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లోనే 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం.. 24 గంటల్లో 7466 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,799కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్ తొమ్మిదవ స్థానానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 89,987 ఉండగా, 71,105 మంది కోలుకున్నారు. అటు.. దేశవ్యాప్తంగా మొత్తం 4706 మంది మరణించారు.

మహారాష్ట్రలో 59,546 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 19372, ఢిల్లీలో 16281, గుజరాత్‌లో 15562, రాజస్థాన్‌లో 8067, మధ్యప్రదేశ్‌లో 7453, ఉత్తర ప్రదేశ్‌లో 7170, పశ్చిమ బెంగాల్‌లో 4536, బిహార్‌లో 3296, ఆంధ్రప్రదేశ్‌లో 3251, కర్ణాటకలో 2533, తెలంగాణలో 2256 కేసులు నమోదయ్యాయి.

తాజా బులిటెన్
First published: May 29, 2020, 9:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading