Home /News /national /

FIRST ELECTRIC TRAIN IN JAMMU KASHMIR INDIAN RAILWAYS CONDUCTS SUCCESSFUL TRIAL BETWEEN BUDGAM AND BARAMULLA MKS GH

Jammu kashmir| Video: కశ్మీర్‌లో తొలి కరెంటు రైలు -ట్రయల్ రన్ సక్సెస్: Indian Railways

కశ్మీర్‌లో తొలి కరెంటు రైలు

కశ్మీర్‌లో తొలి కరెంటు రైలు

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి జమ్మూకాశ్మీర్ లో కరెంటు రైలు కూచుక్ చుక్ పరుగులు తీసింది. కశ్మీర్‌ లోయల్లో ఇకపై ఎలక్ట్రిక్‌ రైళ్లు నడపడానికి మార్గం సుగమమైంది. రైల్వే మంత్రి చెప్పిన వివరాలివే..

కశ్మీర్‌ లోయల్లో ఇకపై ఎలక్ట్రిక్‌ రైళ్లు నడపడానికి మార్గం సుగమమైంది. జమ్మూ కశ్మీర్‌లో రైల్వే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడి బుద్గాం, బారాముల్లా సెక్షన్ల మధ్య మొదటి ఎలక్ట్రిక్ రైలు (Electric Train) ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడిస్తూ ఓ ట్వీట్‌ చేశారు.

కశ్మీర్ రైలు మార్గాన్ని విద్యుద్దీకరించే (Electrification) పనులను ఇండియన్‌ రైల్వే ప్రారంభించింది. కశ్మీర్‌ లోయ ప్రాంతాల్లో రైల్వే లైను విద్యుద్దీకరణ పనుల నేపథ్యంలో 136 కిలోమీటర్ల దూనం ఎలక్ట్రిక్ రైలు ట్రయల్ రన్‌ విజయవంతంగా నిర్వహించడం మైలురాయిగా పేర్కొనవచ్చు.

PM Kisan: రైతులకు శుభవార్త : బ్యాంకు ఖాతాల్లోకి రూ.2000 -ఎల్లుండే జాబితా.. మీ పేరుందా?


మొదటి దశలో బుద్గాం, బారాముల్లా స్టేషన్ల మధ్య మొత్తం 1,271 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత రైల్వేశాఖ అధికారులు తెలిపారు. వీటిలో సోపోర్, బారాముల్లా మధ్య అత్యధికంగా 305 స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా.. బుద్గామ్ ననుంచి మజోమ్, మజోమ్ ననుంచి పట్టన్, పట్టన్ నుంచి హమ్రే, హమ్రే నుంచి సోపోర్ మధ్య స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Optical Illusion: ఈ చిత్రంతో మీ క్యారెక్టర్ ఎలాంటిదో, ఇతరుల రహస్యాలూ తెలుసుకోవచ్చిలా..


రైల్వేలైన్‌ ఓవర్‌హెడ్‌ విద్యుద్దీకరణ పనులు 2019వ సంవత్సరం జూన్‌ నెలలో ప్రారంభమయ్యాయని, అయితే రైల్వేలైన్‌ ఓవర్‌హెడ్ విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసేందుకు 2021వ సంవత్సరం జూన్ నెల వరకు రెండేళ్ల గడువు నిర్ణయించారని కొన్ని నివేదికలు స్పష్టం చేశాయి. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు టెండర్లు వేయగా, ఇటీవలే పూర్తిస్థాయి పనులు ప్రారంభమయ్యాయి.

కళ్లతోనే నేరస్తుల గుర్తింపు.. కేంద్రం కీలక సంర్కరణ.. పార్లమెంట్‌లో Criminal Procedure Bill


భారతీయ రైల్వే జమ్మూకశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కశ్మీర్‌ లోయలోని చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే వంతెన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఉన్న ఈఫిల్‌ టవర్‌ కన్నా దాదాపు 30 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉన్నట్లు సమాచారం. నదిపై 359 మీటర్ల ఎత్తు, 1.3 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే వంతెన కశ్మీర్‌ లోయలోని రియాసీ జిల్లాలో మారుమూల గ్రామాలను కలుపుతుంది. రూ.12 వేల కోట్లతో కొంకణ్‌ రైల్వే ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది.

KCR | Chinna Jeeyar: సమతామూర్తి సందర్శనకు అనుమతి రద్దు.. టికెట్ విషయంలో తగ్గేదేలేదు!


2004లో ప్రారంభమైన ఈ వంతెన పనులు అధిక గాలుల ప్రభావంతో భద్రతా కారణాల దృష్ట్యా 2008లో నిలిచిపోయాయి. ప్రస్తుతం గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకోగలదని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ వంతెన 120 సంవత్సరాల వరకు పటిష్ఠంగా ఉంటుందని చెప్పారు. కాట్రా, బనిహాల్‌ ప్రాంతాల మధ్య ఈ వంతెన కీలక మార్గం కానుంది. నదికి రెండు చివర్లలో కాకుండా మధ్యలో ఎలాంటి సపోర్టు లేకుండా ఉన్న వంతెనల్లో ఇది ప్రపంచంలోనే ఏడోది కావడం విశేషం.



* సెప్టెంబరులో అందుబాటులోకి..
చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్న వంతెన ఈ ఏడాది సెప్టెంబరులో అందుబాటులోకి వస్తుందని జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో రైల్వే అభివృద్ధి పనులకు కేంద్రం ఎక్కువ నిధులు కేటాయిస్తోందని చెప్పారు. 2019వ సంవత్సరం నుంచి రెట్టింపు బడ్జెట్‌ను భారతీయ రైల్వే అందించిందని మనోజ్‌ సిన్హా వివరించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Indian Railways, Jammu kashmir, Kashmir, Train

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు