హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

CBI building Fire: బ్రేకింగ్​ న్యూస్​.. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

CBI building Fire: బ్రేకింగ్​ న్యూస్​.. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

సీబీఐ ఆఫీస్​ (photo : Twitter)

సీబీఐ ఆఫీస్​ (photo : Twitter)

లోధి రోడ్ (Lodhi road) ప్రాంతంలోని సీజీఐ కాంప్లెక్స్‌లో సీబీఐ (CBI) భవనంలోని బేస్​మెంట్​లో మంటలు అంటుకున్నట్లు ఏఎన్​ఐ వార్తా సంస్థ పేర్కొంది. మంటలు రావడంతో కార్యాలయంలోని ఉద్యోగులంతా బయటికి పరుగులు తీశారు. ఫైర్​ ఇంజిన్లు వచ్చి మంటలు అదుపుచేస్తున్నాయి

ఇంకా చదవండి ...

ఢిల్లీ (Delhi) లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​ (Central bureau of Investigation) కార్యాలయం (Office)లో అగ్నిప్రమాదం (fire accident) చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. లోధి రోడ్ (Lodhi road) ప్రాంతంలోని సీజీఐ కాంప్లెక్స్‌లో సీబీఐ (CBI) భవనంలోని బేస్​మెంట్​లో మంటలు అంటుకున్నట్లు ఏఎన్​ఐ వార్తా సంస్థ పేర్కొంది. మంటలు రావడంతో కార్యాలయంలోని ఉద్యోగులంతా బయటికి పరుగులు తీశారు.

ఫైర్​ ఇంజిన్లు వచ్చి మంటలు అదుపుచేస్తున్నాయి. ఘటనకు ఇంకా కారణాలు తెలియ రాలేదు.

మంటలు అయితే అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్​ సర్వీస్​ డివిజనల్ ఆఫీసర్​ ఎస్​కే దువా తెలిపారు. అయితే సీబీఐ అధికారుల నుంచి మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సీబీఐ కార్యాలయంలో చాలా పెద్ద కేసులకు సంబంధించి, దేశంలోనే పేరు గాంచిన ఆయా స్కామ్​లు, ముఖ్యంగా బడా రాజకీయ నేతల నేరాలు, అక్రమ ఆస్తులు, వారి కేసుల సంబంధించి గల సీబీఐ కేసుల్లోని అతి ముఖ్యమైన ఫైల్స్​ భద్రపరుస్తారనే విషయం తెలిసిందే. అగ్నిప్రమాదం జరగడంతో వాటిల్లిన నష్టంపై అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది.

కాగా, గత రెండు నెలల కిందటే ఇదే సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇది కూడా చదవండి:  సార్​... నా కోడిని ఎవరో చంపేశారు.. వెంటనే పోస్టుమార్టం చేసి నిందితులను పట్టుకోండి

ఇవి కూడా చదవండి: ఫేస్​బుక్​ లైవ్​లో మునిగిన తల్లి.. 10వ అంతస్తు నుంచి కిందపడిన రెండేళ్ల కవల పిల్లలు

ఎవరూ లేని స్మశానానికి ఒంటరిగా వెళ్లిన మహిళ.. అక్కడ అస్థిపంజరాన్ని తీసుకొని నృత్యం చేస్తూ..

First published:

Tags: CBI, Delhi, Fire Accident

ఉత్తమ కథలు