పార్లమెంట్‌ అనెక్స్ భవనంలో అగ్ని ప్రమాదం... రంగంలోకి ఫైర్ ఇంజిన్లు..

ప్రతీకాత్మక చిత్రం

త్వరలో సమావేశాలు జరగాల్సిన సమయంలో పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

  • Share this:
    పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం సంభవించింది. అనెక్స్ భవనంలోని ఆరో అంతస్థులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే... ఐదు ఫైరింజన్లను రంగంలోకి దింపి... మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా కారణంగా... సమావేశాలు ఎప్పుడు జరపాలనే అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు జూలై 17న చర్చించారు. కరోనా ఇప్పట్లో పోయేలా లేదు కాబట్టి... ఎంపీల మధ్య సోషల్ డిస్టాన్స్ ఉండేలా చేయాలనుకున్నారు. ఇందుకోసం ప్లేస్ సరిపోదు కాబట్టి... లోక్‌సభ, రాజ్యసభలో చాంబర్లు, గ్యాలరీలను కూడా వాడుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు మూడో వారం నాటికి ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రాజ్యసభ ఎంపీలకు లోక్‌సభలో కూడా సీటింగ్‌ ఏర్పాటు చేశారు. రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాల్ని ప్రసరింపచేసి వైరస్‌ను నాశనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌లోని 4 గ్యాలరీలల్లో మరో ఆరు చిన్న స్క్రీన్లను సెట్ చేయబోతున్నారు. సభలో ఆడియో సిస్టంతోపాటు... చాంబర్లు, గ్యాలరీలను వేరు చేసేందుకు పాలికార్బోనేట్ షీట్‌లు వాడుతున్నారు. సెప్టెంబరు మూడో వారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
    Published by:Krishna Kumar N
    First published: