హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం... మంటలార్పుతున్న ఫైరింజన్లు

ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం... మంటలార్పుతున్న ఫైరింజన్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఘటనా స్థలానికి చేరుకున్న 22 ఫైరింజన్లు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు ఢిల్లీలో వరుసగా మూడు అగ్నిప్రమాదాలు జరిగాయి.

ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సరేలాలోని షూ ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు కూడా వ్యాపించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి గాయలయ్యాయి.దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 22 ఫైరింజన్లు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఢిల్లీలో ఇటీవలే అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న అర్థరాత్రి 12.30 సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. మరో 10 మంది గాయపడినవారిని దగ్గర్లోని సంజయ్ గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. గోడౌన్‌లో అన్నీ బట్టలే ఉండటం వల్ల వాటికి నిప్పు రవ్వలు అంటుకొని... అగ్ని కీలలు ఎగసిపడి... మంటలు చెలరేగి ఉంటాయని అనుకుంటున్నారు. అంతకుముందు జరిగిన మరో ఘటనలో 40కు పైగా మంది  సజీవదహనమయ్యారు. ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికి దేశ రాజధానిలో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలతో జనం ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు.

First published:

Tags: Delhi, Fire Accident

ఉత్తమ కథలు