INS విశాఖపట్నం యుద్ధనౌకలో అగ్నిప్రమాదం

సాయంత్రం 5.44 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. యుద్ధనౌకలోని రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది.

news18-telugu
Updated: June 21, 2019, 9:10 PM IST
INS విశాఖపట్నం యుద్ధనౌకలో అగ్నిప్రమాదం
INS విరాట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న యుద్ధ నౌక INS విశాఖలో అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని యార్డులో ఈ యుద్ధనౌక పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్మాణంలో ఉండగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒక వ్యక్తి అందులో చిక్కుకున్నట్టుగా తెలిసింది. సాయంత్రం 5.44 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. యుద్ధనౌకలోని రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఎనిమిది ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. మంటలు రెండో అంతస్తుకే పరిమితం అయినట్టు అధికారులు తెలిపారు. అయితే, యుద్ధనౌక మొత్తం పొగ అలుముకుంది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేకుండా మంటలను ఆర్పడం మీద దృష్టి పెడుతున్నామని, అగ్నిప్రమాదానికి కారణం ఏంటనే విషయంపై తర్వాత విచారణ చేస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2015 నుంచి INS విశాఖపట్నం యుద్ధనౌకను నిర్మిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 21, 2019, 9:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading