గాంధీధామ్-పూరీ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అనూహ్యరీతిలో మంటల్లో చిక్కుకుంది. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నంద్ బార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత రైల్వేకు సంబంధించి మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్ నుంచి ఒడిశాకు ప్రయాణిస్తోన్న గాంధీధామ్-పూరీ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అనూహ్యరీతిలో మంటల్లో చిక్కుకుంది. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నంద్ బార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ సరిహద్దు దాటిన కొద్దిసేపటికే మహారాష్ట్ర పరిధిలోకి వచ్చే నందుర్బార్ రైల్వే స్టేషన్ కు సమీపంగా ఈ ప్రమాదం జరిగింది.
గాంధీధామ్-పూరీ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్యాంట్రీ కారులో చెలరేగిన మంటలే రైలులో అగ్ని ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ప్యాంట్రీకారు బోగీ మొత్తం కాలిపోయింది. పక్కనున్న మరో రెండు బోగీలకు కూడా మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.
లోకో పైలట్, రైలు గార్డు మంటలను గుర్తించి సకాలంలో రైలును నిలిపేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. ప్యాంట్రీకారు దగ్ధమైపోగా, ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు.
గాంధీధామ్-పూరీ రైలు అగ్నిప్రమాదం
గాంధీధామ్ (గుజరాత్) నుంచి పూరీ (ఒడిశా)కి వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు.. నందుర్బార్ స్టేషన్ నుంచి ముందుకు కదలిన కాసేపటికే ప్యాంట్రీ కారులో మంటలు రాజుకున్నాయి. నిమిషాల్లో అగ్నికీలలు బోగీ అంతటా వ్యాపించాయి. రైలును నిలిపేసి, ప్రయాణికులంతా కిందికి దిగిన తర్వాత ప్యాంట్రీకారు పక్కనున్న బోగీకి కూడా మటలు అంటున్నాయి.
గాంధీధామ్-పూరీ రైలు అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతోన్న దృశ్యం
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఫైటర్లు ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పినప్పటికీ, ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించాయి.
#Watch: 🚨#GandhidhamPuriExpress train catches fire near Nandurbar station. The cause of the fire is still unclear.🚨
కాలిపోతున్న ప్యాంట్రీ కారు నుంచి పొగ ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలోకి ప్రవేశించడంతో ప్రయాణీకులలో భయాందోళనకు గురయ్యారని స్థానిక ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.