రైల్లో మంటలు.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

news18-telugu
Updated: September 6, 2019, 3:03 PM IST
రైల్లో మంటలు.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం
  • Share this:
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కేరళ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పవర్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 8 ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపు చేశారు. 8వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ప్రమాదం జరిగింది. రైల్లో మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైల్లో ఉన్న ప్రయాణికులందరినీ కిందకు దింపారు. అందరూ క్షేమంగా బయటపడడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, కేరళ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ చండీగఢ్-కొచువేలి మధ్య నడుస్తుంది.

వీడియో ఇక్కడ చూడండి:

Published by: Shiva Kumar Addula
First published: September 6, 2019, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading