ESI హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం... కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

నోయిడాలోని ESIC హాస్పిటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి.

news18-telugu
Updated: January 9, 2020, 12:13 PM IST
ESI హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం... కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ESI హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం... కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
  • Share this:
ఎంతో రద్దీగా, బిజీగా కనిపించే నోయిడాలో జరిగిందీ అగ్ని ప్రమాదం. సెక్టార్ 24లోని స్థానిక ESIC హాస్పిటల్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో... అక్కడి రోగుల్ని హడావుడిగా వేరే ఆస్పత్రులకు తరలించారు. వెంటనే డాక్టర్లు ఫైర్ ఇంజిన్‌కి కాల్ చెయ్యడంతో... మూడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఏడు అంతస్థుల ఆస్పత్రి భవనంలో వ్యాపించిన మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే... మంటలు కాస్త ఎక్కువగానే ఉండటంతో... అదుపులోకి తేవడం కష్టమవుతోంది. అసలీ అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించిందో ఎవరికీ తెలియట్లేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చనే అంచనాలున్నా... అలాంటి అవకాశం లేదంటున్నారు డాక్టర్లు. హాస్పిటల్‌లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయని చెబుతున్నా్రు.



First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు