అది గుజరాత్‌లోని... బారుచ్. అక్కడి బారుచ్ వెల్ఫేర్ ఆస్పత్రిలో శనివారం రాత్రి 1 గంట సమయంలో.. అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో... 16 మంది కరోనా పేషెంట్లు చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మోధ్యా తెలిపారు. ఓవైపు మంట, మరోవైపు పొగ పెద్ద ఎత్తున రావడంతో... పేషెంట్లు ఊపిరి అందక చనిపోయినట్లు బారుచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేంద్ర సిన్హా చూడసమ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో... ఆస్పత్రిలోని నాలుగు అంతస్థుల్లో మొత్తం 70 మంది పేషెంట్లు ఉన్నారు. వారిలో 24 మంది ICU యూనిట్లో ఉన్నారు. స్థానికులు, ఫైర్ సిబ్బంది కలిసి... కాపాడిన పేషెంట్లకు ప్రస్తుతం చుట్టుపక్కల ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
Gujarat| Fire breaks out at a COVID-19 care centre in Bharuch. Affected patients are being shifted to nearby hospitals. Details awaited. pic.twitter.com/pq88J0eRXY
— ANI (@ANI) April 30, 2021
మంటల్ని గంటలో అదుపులోకి తెచ్చినా... అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అనేది తెలియలేదు. ఈ ఆస్పత్రి అహ్మదాబాద్‌కి 190 కిలోమీటర్ల దూరంలో... బారుచ్-జంబుసర్ హైవే మార్గంలో ఉంది. దీన్ని ఓ ట్రస్ట్ నిర్వహిస్తోంది. దేశంలో తొలిసారి కరోనా వచ్చాక... ఈ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చారు. అక్కడ సంవత్సరం నుంచి కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలాంటిది... ICU యూనిట్లోనే అగ్ని ప్రమాదం జరగడంతో... మృతుల సంఖ్య బాగా పెరిగిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఇది జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు స్టాఫ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Horoscope today 1-5-2021: నేటి రాశి ఫలాలు... ఇవాళ ఎవరికి ఎలా ఉందంటే...
ఈ అగ్నిప్రమాదం వార్త తెలియగానే... దాదాపు 5వేల మంది బారుచ్ ఆస్పత్రికి పరుగన వచ్చారు. వారిలో చాలా మంది రోగుల బంధువులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. తమ వారి కోసం వారు అరుపులు, కేకలు పెట్టారు. రాత్రంతా ఆర్తనాదాలే వినిపించాయి. అంతా కన్నీటి విషాదంతో నిండిపోయింది. తరచూ జరుగుతున్న ఇలాంటి అగ్నిప్రమాదాలతో... కరోనా పేషెంట్ల మరణాలు మరింతగా పెరుగుతున్నాయి.
ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19