హోమ్ /వార్తలు /జాతీయం /

Mumbai Fire Accident: కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

Mumbai Fire Accident: కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో డ్రీమ్స్ మాల్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్రమంగా అవి పై అంతస్తులకు కూడా వ్యాపించాయి.

    ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభించింది. కరోనా ఆస్పత్రి ఉన్న ఓ మాల్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరకొందరికి గాయాలయ్యాయి. గురువారం అర్ధరాత్రి భాండూప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాండూప్‌లో ఉన్న డ్రీమ్స్ మాల్‌లో మంటలు చెలరేగాయి. ఆ మాల్‌లోని మూడో అంతస్తులో సన్‌రైజ్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆ ఆస్పత్రిలో 76 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మంటల ధాటికి ఆస్పత్రిలోకి దట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలతో ఊపిరాడక కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరు చనిపోయారు. మరో 76 మందిని వేరొక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచారు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Crime news, Fire Accident, Mumbai

    ఉత్తమ కథలు