హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fire accident: బాలీవుడ్ నటుడు ఇంటి పక్కన భారీ అగ్ని ప్రమాదం..

Fire accident: బాలీవుడ్ నటుడు ఇంటి పక్కన భారీ అగ్ని ప్రమాదం..

షారుఖ్ ఇంటిపక్కనే అపార్ట్ మెంట్ లో ప్రమాదం

షారుఖ్ ఇంటిపక్కనే అపార్ట్ మెంట్ లో ప్రమాదం

Mumbai: ముంబైలో సోమవారం బాంద్రాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో  అగ్ని ప్రమాదం (Fire accident)  సంభవించింది. బాంగ్రాలోని బ్యాండ్ స్టాండ్ రోడ్ లోని జీవేష్ భవనంలో సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కాగా, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shahrukh  khan) బంగ్లా మన్నాత్ పక్కనే ఎత్తైన భవనంలో 14 వ అంతస్థులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. వెంటన స్థానికుల ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్ లతో చేరుకున్నారు. మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. అధికారులు ముందు జాగ్రత్తగా ప్రజలను అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించారు. అక్కడ అంబూలెన్స్ లను కూడా సిద్ధంగా ఉంచారు. కాగా, అధికారులు మంటలు చెలరేగడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మంటలు షార్ట్ సర్య్కూట్ వలన వ్యాపించాయా.. మరేదైన ప్రమాదం జరిగిందా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.

గతంలోను ముంబైలో భారీ అగ్నిప్రమాదం (Mumbai Fire Accident) జరిగింది.

కర్రీ రోడ్డు ప్రాంతంలో ఉన్న 60 అంతస్తుల అవిఘ్నా పార్క్ టవర్‌ (Avighna Park Tower)లో మంటలు చెలరేగాయి. 19వ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను చూసి ఆ భవనంలో నివసిస్తున్న వారు భయంతో వణికిపోయారు. కొందు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. ఐతే ఓ వ్యక్తి 19వ అంతస్తు బాల్కని నుంచి కింద పడి మరణించారు. మృతుడిని 30 ఏళ్ల అరుణ్ తివారిగా గుర్తించారు పోలీసులు. అతడు కింద పడిన వెంటనే హుటాహుటిన KEM ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఉదయం 11.50 నిమిషాల సమయంలో భవనం నుంచి మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. 26 మందికి మంటల నుంచి కాపాడారు. ఇక ముందు జాగ్రత్తగా 19 అంతస్తులో ఉండే మిగతా వారిని కిందకు తరలించారు. ఈ ప్రమాదాన్ని లెవెల్-4  గుర్తించారు అధికారులు.  అంటే చాలా తీవ్రమైన అగ్నిప్రమాదమని చెప్పారు. అగ్నిప్రమాదానికి గురైన అవిఘ్నా పార్క్ టవర్‌లో మొత్తం 61 అంతస్తులు ఉన్నాయి. ఐతే ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

First published:

Tags: Fire Accident, Mumbai, Shah Rukh Khan

ఉత్తమ కథలు