Home /News /national /

FIRE ACCIDENT IN SERUM INSTITUTE IN PUNE 10 FIRE TENDERS AT SPOT BA

Serum Institute Fire accident: కరోనా వ్యాక్సిన్ తయారు చేసే సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం (Image: ANI)

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం (Image: ANI)

భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారు చేసే సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అగ్నిప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ప్లాంట్‌లో టెర్మినల్ 1 గేట్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారు చేసే సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అగ్నిప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ప్లాంట్‌లో టెర్మినల్ 1 గేట్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. 10 ఫైరింజన్లు వెంటనే వచ్చాయి. మంటలను ఆర్పుతున్నారు. అయితే, ప్రాథమికంగా అక్కడ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియలేదు. కానీ, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని ఉంటాయని చెబుతున్నారు. పెద్ద ఎత్తున పొగలు మాత్రం వ్యాపించాయి. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి పొగ పెద్ద ఎత్తున బయటకు వస్తున్న దృశ్యాలను ఏఎఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అసలు ప్రమాదానికి కారణం ఏంటనే వివరాలు మరికొంత సేపట్లో తెలిసే అవకాశం ఉంది. దీనిపై సీరం సంస్థ కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు.

    మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కంట్రోల్‌లోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, మంటలు మాత్రం వేగంగా వ్యాపిస్తున్నాయి. సెజ్ 3 భవనంలో నాలుగు, ఐదు అంతస్తులకు కూడా మంటలు వ్యాపించాయి. ప్లాంట్‌లో ఉండే అగ్నిమాపక యంత్రాలతో పాటు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. అగ్నిప్రమాదం నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిందని, వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అవాంతరాలు ఉండబోదని అంచనా వేస్తున్నారు.



    మరోవైపు సీరం సంస్థలో అగ్నిప్రమాదంపై ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. కేవలం, రెండు ఫ్లోర్లు మాత్రమే ధ్వంసం అయ్యాయని చెప్పారు.



    భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థల్లో సీరం ఇన్‌స్టిట్యూట్ ముఖ్యమైంది. సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Corona Vaccine, COVID-19 vaccine, Pune, Serum Institute

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు