హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఢిల్లీలో అగ్ని ప్రమాదం... 9 మంది సజీవదహనం

ఢిల్లీలో అగ్ని ప్రమాదం... 9 మంది సజీవదహనం

అగ్ని ప్రమాదం (credit - twitter - ANI)

అగ్ని ప్రమాదం (credit - twitter - ANI)

ఈమధ్య ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. తాజా విషాదం వెనక ఏం జరిగింది? అగ్ని ప్రమాదానికి కారణమేంటి?

  ఢిల్లీలో రెండు వారాల గ్యాప్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కిరారి ప్రాంతంలో ఓ డ్రెస్ గోడౌన్‌లో ఇవాళ తెల్లావారక ముందు అర్థరాత్రి 12.30 సమయంలో ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. అప్పటికే అందులోని చాలా మంది మంటల్లో చిక్కుకున్నారు. తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. మరో 10 మంది గాయపడినవారిని దగ్గర్లోని సంజయ్ గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ ప్రాంతం మొత్తం బూడిద కుప్పలా మారింది. పోలీసులు కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు. మంటలు ఎందుకు చెలరేగాయో తెలుసుకుంటున్నారు. ఓ అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటుందనీ... గోడౌన్‌లో అన్నీ బట్టలే ఉండటం వల్ల వాటికి నిప్పు రవ్వలు అంటుకొని... అగ్ని కీలలు ఎగసిపడి... మంటలు చెలరేగి ఉంటాయని అనుకుంటున్నారు. ఏదేమైనా ఇంత మంది చనిపోవడం, గాయాలపాలవడం అత్యంత విషాదకరం.

  అగ్ని ప్రమాదం (credit - twitter - ANI)

  అగ్ని ప్రమాదం (credit - twitter - ANI)

  డిసెంబర్‌ 8న ఢిల్లీలోని అనాజ్‌మండీ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ.2 లక్షలు, కేంద్రం రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ విషాదం అలా వెంటాడుతుండగానే... మరో ప్రమాదం జరగడం దురదృష్టకరం. జనరల్‌గా ఎండాకాలంలో ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటిది శీతాకాలంలో జరుగుతుండటం మరింత దారుణం.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Breaking news, India news, National News, News online, News today, News updates, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు