హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

10 Infants Dead: 10 మంది పసికందుల సజీవ దహనంతో అలర్ట్... అన్ని ఆస్పత్రుల్లో ఆడిట్‌కి ఆదేశం

10 Infants Dead: 10 మంది పసికందుల సజీవ దహనంతో అలర్ట్... అన్ని ఆస్పత్రుల్లో ఆడిట్‌కి ఆదేశం

10 మంది పసికందుల సజీవ దహనంతో అలర్ట్... అన్ని ఆస్పత్రుల్లో ఆడిట్‌కి ఆదేశం (image credit - twitter - ANI)

10 మంది పసికందుల సజీవ దహనంతో అలర్ట్... అన్ని ఆస్పత్రుల్లో ఆడిట్‌కి ఆదేశం (image credit - twitter - ANI)

Fire Accident: అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? 10 మంది పసికందులు ఎలా చనిపోయారు? డాక్టర్లు ఎందుకు వారిని కాపాడలేకపోయారు? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Fire Accident in Maharashtra: మహారాష్ట్రలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్ర దిగ్ర్భాంతివ్యక్తం చేశారు. వెంటనే దీనిపై ఎంక్వైరీ జరిపించి... మహారాష్ట్రలోని అన్ని ఆస్పత్రుల్లో ఆడిట్ జరపాలని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపేని ఆదేశించారని శివసేన మౌత్ పీస్ సామ్నా తెలిపింది. ప్రమాదంలో సజీవ దహనమైన పిల్లల తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. సాయంత్రం 5 గంటలకు తోపే ఆస్పత్రికి వెళ్లనున్నారు. భండారా జిల్లాలోని... జనరల్ ఆస్పత్రిలో... గత అర్థరాత్రి 2 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU)లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో అందులో అనారోగ్యంతో ఉన్న పసికందులు మంటల్లో చిక్కుకున్నారు. అలర్టైన ఆస్పత్రి సిబ్బంది, ఫైర్ ఇంజిన్ సిబ్బందీ కలిసి... మంటల్లోనే ఏడుగురు పిల్లల్ని కాపాడగలిగారు. మరో 10 మంది మంటల్లో సజీవ దహనం అయ్యారు. ఆ తర్వాత మంటల్ని అదుపులోకి తెచ్చారు.

చనిపోయిన పిల్లల వయసు నెల నుంచి 3 నేలల మధ్యే. అసలు మంటలు ఎందుకు వ్యాపించాయి... SNCUలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి... అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు వ్యాపించి ఉంటాయనే అనుమానం కలుగుతోంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇదంతా జరిగిందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంటల నుంచి కాపాడిన పిల్లలను వేరే వార్డుల్లో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

ఈ ఘటన అత్యంత బాధాకరమైనది అన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్... సరైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించారు. గాయపడిన వారు వెంటనే కోలుకుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపారు.

ఇది కూడా చదవండి:Makar Sankranti 2021: సంక్రాంతి నాడు ఈ పనులు తప్పక చేయండి... అదృష్టం మీదే

రేపటి కల్లా అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో తెలిసే అవకాశం ఉంది. మహారాష్ట్రలోనే కాదు చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఆస్పత్రులను ఆధునీకరించాల్సిన అవసరం ఉన్నా... అలాగే కంటిన్యూ చేస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ... ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంకా ప్రపంచాన్ని చూడని పసికందులు... మంటల్లో ఆహుతి అయిపోవడం అత్యంత విషాదకరం. మహారాష్ట్రే కాదు... అన్ని రాష్ట్రాలూ మేల్కొని... ఇలాంటి పరిస్థితులు తమ తమ రాష్ట్రాల్లో తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది.

First published:

Tags: Fire Accident, Maharashtra