• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • FIR LODGED AGAINST THE PIGEON CARRYING SUSPICIOUS WHITE PAPER VS

FIR on pigeon : పావురంపై కేసు..గుఢాచార్యం కేసులో అరెస్ట్..

FIR on pigeon : పావురంపై కేసు..గుఢాచార్యం కేసులో అరెస్ట్..

ప్రతీకాత్మక చిత్రం

suspicious pigeon పాకిస్థాన్ బోర్డర్ లో అనుమానంగా కనిపించిన ఓ పావురాన్ని ఇండియన్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పావురం కాలుకు ఒక తెలియని కోడ్ ఉండడంతో అనుమానంగా ఎఫ్ఐఆర్ నమోతు చేసినట్టు తెలిపారు.

  • Share this:
భారత, పాకిస్తాన్ బోర్డర్‌ల మధ్య చీమ చిటుక్కుమన్నా...ఇరువర్గాలు అలర్ట్ అవుతాయి..నిబంధనలకు విరుద్దంగా ఇరు దేశాల మధ్య ఎవరు రాకపోకలు సాగించినా..వెంటనే అరెస్ట్ చేస్తారు.. బార్డర్‌లో ఎవరు అనుమానంగా కనిపించినా వెంటనే అరెస్ట్ చేస్థారు.. అయితే ఇప్పుడు రెండు దేశాల మధ్య శత్రుత్వంతో స్థానిక ప్రజలతో పాటు ఓ పావురం కూడ చిక్కుల్లో పడింది. ఇరు దేశాల గూఢచార్య సమస్యలకు ఆ పావురం వేదికయింది.

ఏప్రిల్ 17న పాకిస్తాన్ సరిహద్దు నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్‌ బోర్డర్‌ వద్ద నీరజ్ కుమార్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ పావురం అతని భుజంపై వచ్చి వాలింది. అయితే.. ఆ పావురం కాళ్లకు ఏదో‌ కట్టి ఉన్నట్లు గమనించిన కానిస్టేబుల్‌ అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పావురాన్ని పట్టుకుని, పోస్ట్ కమాండర్ ఒంపాల్ సింగ్‌కు సమాచారం అందించాడు..అనుమానంతో అధికారులు పావురాన్ని స్కాన్ చేశాడు. దీంతో పావురంలోపల ఒక తెల్ల కాగితం కనిపించగా, దానిపై ఒక సంఖ్య కూడా ఉన్నట్టు గుర్తించారు...దీంతో అది ఓ కోడ్ భాష లాంటిదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పావురాన్ని ఉగ్రవాదులు గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారనే అనుమానంతో పావురంపై అమృత్‌సర్‌ సమీపంలోని ఖహగ్ర పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు