CM Father: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ముఖ్యమంత్రి తండ్రిపై కేసు నమోదు.. సీఎం ఏమన్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్‌గర్‌ రాజకీయాల్లో ఇప్పుడు ఓ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఛత్తీస్‌గర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ తండ్రే ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. తండ్రిపై నమోదైన ఎఫ్‌ఐఆర్ గురించి సీఎంను ప్రశ్నించగా.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. 86 ఏళ్ల వయసున్న తన తండ్రి అయినా సరే అని సీఎం వ్యాఖ్యానించారు.

  • Share this:
    రాయ్‌పూర్: ఛత్తీస్‌గర్‌ రాజకీయాల్లో ఇప్పుడు ఓ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఛత్తీస్‌గర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ తండ్రే ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. తండ్రిపై నమోదైన ఎఫ్‌ఐఆర్ గురించి సీఎంను ప్రశ్నించగా.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. 86 ఏళ్ల వయసున్న తన తండ్రి అయినా సరే అని సీఎం వ్యాఖ్యానించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఒక కొడుకుగా తన తండ్రిని గౌరవిస్తానని, కానీ ఒక ముఖ్యమంత్రిగా మాత్రం.. ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా ఆయన తప్పులు చేస్తే ఉపేక్షించబోనని సీఎం వ్యాఖ్యానించారు. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. రాయ్‌పూర్‌లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం భూపేష్ భగేల్ తండ్రి నంద్ కుమార్ భగేల్ హాజరయ్యారు.

    ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌లోని గ్రామీణ ప్రజలందరినీ తాను కోరుకునేది ఒక్కటేనని.. బ్రాహ్మణులను మీ ఊళ్లలోకి రానీయవద్దని నంద్ కుమార్ భగేల్ వ్యాఖ్యానించారు. ఇతర సామాజిక వర్గాల ప్రజలందరితో తాను మాట్లాడతానని.. అందరం కలిసి బ్రాహ్మణులను బహిష్కరిద్దామని సీఎం తండ్రి పిలుపునిచ్చారు. వోల్గా నదీ తీరాలకు వాళ్లను తిరిగి పంపాల్సిన అవసరం ఉందని నంద్ కుమార్ భగేల్ చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. ముఖ్యమంత్రి తండ్రి అయి ఉండి.. ఒక సామాజిక వర్గాన్ని బహిష్కరించాలంటూ.. ఇలా బాధ్యత లేకుండా.. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏంటని బ్రాహ్మణ సామాజిక వర్గం మండిపడింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ‘సర్వ్ బ్రాహ్మిణ్ సమాజ్’ సభ్యులు ఫిర్యాదు చేశారు.

    ఇది కూడా చదవండి: Shocking: జులై 2, 2021న పెళ్లైంది.. కాపురానికెళ్లి ఇల్లు క్లీన్ చేస్తుంటే భార్యకు ఊహించని నిజం తెలిసింది.. ట్విస్ట్ ఏంటంటే..

    ఐపీసీ సెక్షన్ 153-ఏ (భిన్న వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్నందుకు), 505 (1) (బి) సెక్షన్ల కింద ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన తండ్రి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కూడా తప్పుబట్టారు. ఛత్తీస్‌గర్ ప్రభుత్వం అన్ని మతాల, వర్గాల, కులాల ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తన తండ్రి చేసిన వ్యాఖ్యలు కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, అశాంతిని రాజేసే విధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తన తండ్రి వ్యాఖ్యల పట్ల తాను కూడా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఛత్తీస్‌గర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ చెప్పారు.
    Published by:Sambasiva Reddy
    First published: