మన దేశంలో కొంతమంది క్రికెటర్లు.. వృత్తిపరంగా రాణిస్తారు.. వ్యక్తిగతంగా ఫెయిలవుతారు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఈ లిస్టులో చేరి చాలా కాలమైంది. మరోసారి ఆయన చిక్కుల్లో పడ్డారు. వినోద్ తాగి వచ్చి... తనను కొడుతున్నాడనీ, తిడుతున్నాడనీ.. ఆయన భార్య.. ముంబై.. బాంద్రా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ఆరోపణల స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు... FIR రాశారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో కావాలనే గాయపరచడం), సెక్షన్ 504 (అవమానించడం) కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల దగ్గరకు వచ్చినప్పుడు ఆమె తలపై చెయ్యి వేసుకొని ఉంది. ఏమైందని అడిగితే.. తన భర్త వంటగదిలోని ప్యాన్‌ను తనపైకి విసిరేశాడనీ.. అది తలకు తగిలి గాయమైందని ఆమె తెలిపింది. ఆరోపణలు చేసిన తర్వాత ఆమె... పరిస్థితులు చక్కబడతాయి అని పోలీసులకు తెలిపింది.
ఇదంతా ఎప్పుడు జరిగింది అని పోలీసులు అడిగితే.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 1.30 మధ్య జరిగిందని తెలిపింది. ఆమె చెప్పిన దాని ప్రకారం... వినోద్ కాంబ్లీ.. బాగా మద్యం తాగిన పొజిషన్‌లో... బాంద్రాలోని తన ఫ్లాట్‌లోకి వెళ్లాడు. ఆమె... మళ్లీ తాగొచ్చారా అంటూ రెండు మాటలు అనేసరికి.. ఆమెను ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. కొట్టబోతుంటే... ఆ ఇంట్లోని 12 ఏళ్ల కొడుకు... తన తండ్రిని ఆపేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత కాంబ్లీ.. కిచెన్‌లోకి వెళ్లి.. ప్యాన్ తెచ్చి... ఆమెపైకి విసిరేశాడు.
బాంద్రా పోలీసుల ప్రకారం.. గాయపడిన ఆమె ముందుగా.. మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం భాభా హాస్పిటల్‌కి వెళ్లింది. ఆ తర్వాత పోలీసుల్ని కలిసింది. దీనిపై ప్రశ్నించేందుకు పోలీసులు.. కాంబ్లీకి ఫోన్ చెయ్యగా... స్విచ్ఛాఫ్ అయ్యిందని తెలిసింది.
తనను, తన కొడుకునూ కారణం లేకుండా కొట్టాడనీ... ప్యాన్ తర్వాత.. బ్యాట్‌తో కూడా కొట్టాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఇలా కాంబ్లీ.. క్రికెట్‌లో ఎలా ఆడినా... భార్యకు మంచి భర్తగా, కొడుక్కి మంచి తండ్రిగా మాత్రం లేడని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.