FIR AGAINST WOMAN FOR USING RATAN TATAS CAR NUMBER TO AVOID TRAFFIC CHALLAN SRD
Ratan Tata : వామ్మో .. మాములు తెలివి కాదుగా..రతన్ టాటా కారు నెంబర్ తోనే మస్కా కొట్టించిన మహిళ
FIR against woman for using Ratan Tatas Car
Ratan Tata : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ ఏకంగా రతన్ టాటా కారు నంబర్‌ను వాడుతూ ట్రాఫిక్ పోలీసులకు మస్కా కొట్టింది. కానీ చివరకు అడ్డంగా బుక్కైంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. దేశ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సంస్థ ఓనర్ రతన్ టాటాకు చెందిన కారు నంబర్ (ఎంహెచ్01 డికె 0111) ప్లేట్‌ను ఉపయోగించిన కారణంగా ముంబయి పోలీసులు ఓ మహిళపై కేసు నమోదు చేశారు. రతన్ టాటాకు చెందిన కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వచ్చిన ఈ-చలాన్లు టాటా సన్స్ ఆఫీసుకు వెళ్లాయి. దీంతో అప్రమత్తమైన ఉద్యోగులు.. వెంటనే పోలీసులకు పిర్యాదు చేసారు. దీంతో విచారణ చేపట్టిన ముంబయి పోలీసులకు ఒక కొత్త విషయం తెలిసింది. ఈ నేరానికి పాల్పడిన కారు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినదని, దీని యజమాని మహిళ అని తరువాత కనుగొనబడింది. ఆమెను వెంటనే అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు.వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల బారినపడకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ కనిపించకుండా జిమ్మిక్కులు చేయడం సర్వ సాధారణం. కానీ ఈ మహిళ ఏకంగా రతన్ టాటా కారు నంబర్‌ను వాడుతూ ట్రాఫిక్ పోలీసులకు మస్కా కొట్టింది. కానీ చివరకు అడ్డంగా బుక్కైంది.
రతన్ టాటా కారు నంబర్‌ను మరో మహిళ తన కారుకు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను గీతాంజలి సామ్ షాగా గుర్తించి కేసు నమోదు చేశారు. అయితే గీతాంజలి మాత్రం.. ఆ నంబర్ రతన్ టాటాది అన్న విషయం తనకు తెలియదని పోలీసులతో చెప్పారు. అంతేకాదు,ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఒకరు ఇచ్చిన సూచన మేరకు తాను ఆ కారు నంబర్ వాడుతున్నట్లు తెలిపారు. జీవితంలో మంచి స్థానంలో ఉండాలంటే ఆ నంబర్ వాడాలని న్యూమరాలజిస్ట్ చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ డమ్మీ నంబర్ ప్లేట్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇప్పుడు రతన్ టాటాకు చెందిన కారుకు వచ్చిన ఈ-చలాన్లు మళ్లీ ఆ మహిళ పేరుపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ-చలాన్లు జారీ చేసిన వివిధ ప్రదేశాల సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీ చేయడం ప్రారంభించినప్పుడు ఈ విషయం బయటకి వచ్చిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ నెంబర్ ప్లేట్లను ఉపయోగించవద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.