Home /News /national /

FINANCE MINISTER NIRMALA SITHARAMAN LATEST STATEMENT ON CRYPTOCURRENCY BITCOIN IN RAJYA SABHA MKS

Cryptocurrency చాలా రిస్క్, అందుకే Bitcoinపై బిల్లు తెస్తున్నాం: ఆర్థిక మంత్రి Nirmala Sitharaman

రాజ్యసభలో బిట్ కాయిన్ పై మాట్లాడుతోన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

రాజ్యసభలో బిట్ కాయిన్ పై మాట్లాడుతోన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

క్రిప్టో కరెన్సీ చాలా రిస్కుతో కూడిన వ్యవహారమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బిట్ కాయిన్ కట్టడికి కేంద్రం కట్టుబడి ఉందని, అతి త్వరలోనే పార్లమెంటులో బిల్లు పెట్టబోతున్నామని రాజ్యసభలో ఆమె ప్రకటించారు.

Bitcoin.. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పొంది, భారత్ లోనూ దూసుకుపోతోన్న ఈ రూపంలేని Cryptocurrencyకి గుర్తింపు అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మంగళవారం నాటి ప్రశ్నోత్తరాలకు హాజరైన ఆమె.. బిట్ కాయిన్లపై పలువురు ఎంపీలు అడిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీని గుర్తించే ప్రతిపాదనలేవీ ప్రభుత్వానికి లేవంటూ సోమవారం నాడు కుండబద్దలుకొట్టిన నిర్మల.. బిట్ కాయిన్ పై అతి త్వరలోనే పార్లమెంటులో బిల్లు పెడతామని మంగళవారం నాడు స్పష్టం చేశారు. అంతేకాదు, క్రిప్టోకరెన్సీని అపాయంతో కూడిందిగా ఆమె అభివర్ణించారు.

ఇప్పటిదాకా అధికారిక అనుమతులు లేకున్నా భారత్ లో బిట్ కాయిన్ ట్రేడింగ్ జోరుగా సాగుతుండటం, క్రిప్టో కరెన్సీ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్న క్రమంలో దీనిపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి రాగా, బిట్ కాయిన్ ను గుర్తించబోరాదనే విధానాన్ని మోదీ సర్కార్ ప్రకటించింది. క్రిప్టో కరెన్సీ చాలా రిస్కుతో కూడిన వ్యవహారమని ఆర్థిక మంత్రి నిర్మల ఇవాళ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. అయితే, క్రిప్టో కరెన్సీ కంపెనీల ప్రకటనల్ని నిషేధించే దిశగా నిర్ణయాలేవీ తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. దేశంలో జరిగే బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్ ట్రాన్సాక్షన్ల డేటాను సేకరించడంలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

రోజూ మధ్యాహ్నం కోడలిని అలా చూస్తూ తట్టుకోలేక అత్తమామల అకృత్యం -అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారు



బిట్ కాయిన్ కు సంబంధించి కొంత కాలంగా కసరత్తు చేస్తోన్న మోదీ సర్కార్ ఇప్పటికే అంతర్గతంగా పలు నిర్ణయాలు తీసుకుంది. వాటిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానాల రూపంలో సభకు తెలియజేస్తున్నారు. బిట్ కాయిన్ల కట్టడికి సంబంధించి ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021’ను పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు సభ ముందుకురానుంది.

800 year old mummy : సంచలన చరిత్రను వెలికితీశారు -పెరూలో తక్కువ వయసున్న మమ్మీ -ఈజిప్ట్ వెలుపల తొలిసారి


భారత్ లో క్రిప్టో క‌రెన్సీ లావాదేవీల ట‌ర్నోవ‌ర్ ప్ర‌స్తుతం 100 కోట్ల డాల‌ర్ల‌కు చేరుకుంది. ఆదాయం ప‌న్ను చ‌ట్టం-1961 కింద క్రిప్టో క‌రెన్సీల‌పై ప‌న్ను వ‌సూలు చేయ‌డానికి ఎటువంటి నిబంధ‌న‌లేకపోవడంతో చాలా మంది వీటిని సొంతం చేసుకుంటున్నారు. బిట్ కాయిన్లపై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోన్న క్రమంలో దానికి అడ్డుకట్ట వేసేలా కేంద్రం నియంత్రణ బిల్లుల్ని తీసుకురానుంది. బ్లాక్ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కొన్ని ప్రైవేట్ క్రిప్టోలకు అనుమతిచ్చి, మిగిలిన ప్రైవేట్ క్రిప్టోలను బ్యాన్ చేసేలా, డిజిటల్ రూపాయిని తెచ్చేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐకి సైతం అనుమతిచ్చేలాంటి అంశాలు బిల్లులో ఉండొచ్చని తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bitcoin, Cryptocurrency, Nirmala sitharaman, Parliament Winter session

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు