FINANCE MINISTER NIRMALA SITHARAMAN EXPLAINED DETAILS OF FINANCIAL PACKAGE AK
Nirmala sitharaman: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు
నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
Nirmala sitharaman Announcement: చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కేంద్రం ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ తరహా పరిశ్రమలకు రుణాల కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు. ఇందులో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కేంద్రం ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ తరహా పరిశ్రమలకు రుణాల కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాలుగేళ్ల కాలపరిమితి కోసం ఈ రుణాల ఇస్తారని... వీటిని ప్రభుత్వమే వందశాతం గ్యారంటీ ఇస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 45 లక్షల కంపెనీలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ రుణాల కారణంగా వాటి కార్యకలాపాలను కొనసాగించడంతో పాటు వాటి ద్వారా ఉద్యోగాలు పొందుతున్నవారికి కూడా రక్షణ ఉంటుందని అన్నారు.
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 20 వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి పరిశమ్రలకు ఆర్థిక సాయం అవసరం ఉంటుందని తెలిపిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాటి కోసం కేంద్రం 20 వేల కోట్ల రుణాలను ఇవ్వనుందని ప్రకటించారు. దీని వల్ల దాదాపు 2 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ది కలుగుతుందని అన్నారు. ఎన్పీఏలుగా ఉన్న కంపెనీలు కూడా ఇందుకు అర్హులే అని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన అర్థం కూడా మారాలని కేంద్రం తెలిపింది. వాటికి మరింత లబ్ది చేకూరేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఆయా కంపెనీలకు సంబంధించిన పెట్టుబడుల మొత్తాన్ని పెంచడంతోపాటు టర్నోవర్ సామర్థ్యాన్ని కూడా పెంచినట్టు తెలిపారు. ఈ రకంగా ఆ కంపెనీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.