Forbes 2020: Powerful Women listలో నిర్మలా సీతారామన్.. మన దేశానికి చెందిన మరో ముగ్గురు కూడా..

నిర్మలా సీతారామన్(ఫైల్ ఫొటో)

మన ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫోర్బ్స్ 2020 పవర్ ఫుల్ వుమెన్ (Powerful Women) జాబితాలో చోటు సంపాదించారు. 17వ యాన్యువల్ ఫోర్బ్స్ (Forbes) పవర్ లిస్ట్ లో 30 దేశాలకు చెందిన శక్తివంతమైన మహిళలుండగా వారిలో 4 తరాలున్న మహిళలుండటం మరో హైలైట్.

  • Share this:
మన ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫోర్బ్స్ 2020 పవర్ ఫుల్ వుమెన్ (Powerful Women) జాబితాలో చోటు సంపాదించారు. 17వ యాన్యువల్ ఫోర్బ్స్ (Forbes) పవర్ లిస్ట్ లో 30 దేశాలకు చెందిన శక్తివంతమైన మహిళలుండగా వారిలో 4 తరాలున్న మహిళలుండటం మరో హైలైట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్ పత్రిక. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మనదేశానికి చెందిన కిరణ్ మజుందార్ షా, రోష్నీ నాడార్ వంటి వారు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. 2019లో కూడా ఫోర్బ్స్ (Forbes) లిస్ట్ లో మనదేశానికి చెందిన ముగ్గురు మహిళలు చోటు సంపాదించుకున్నారు. 2020 సంవత్సరానికి గాను 100 మంది శక్తివంతమైన మహిళల లిస్ట్ లో తొలి స్థానం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సంపాదించారు.

కాగా మెర్కెల్ గత 10 ఏళ్లుగా ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో కొనసాగుతుండటం హైలైట్. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఇటీవలే ఎన్నికైన కమలా హ్యారిస్ ( Kamala Harris) ఈ లిస్ట్ లో 3వ స్థానంలో నిలిచారు. భారతీయ మూలాలున్న మహిళగా కమలా 3వ స్థానం సంపాదించటం మరో విశేషం. 4 తరాలకు చెందిన మహిళలతో కూడిన ఈ లిస్టులో 10 మంది దేశాధినేతలు, 38 మంది సీఈఓలు, ఐదుగురు వినోద రంగానికి చెందిన వారున్నారు.

41వ స్థానంలో నిర్మలా
మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో 41వ స్థానంలో నిలిచారు. గతేడాది ఈ జాబితాలో నిర్మలా సీతారామన్ 34వ ర్యాంక్ సంపాదించారు. ఈ ఏడాది నిర్మలా ర్యాంక్ తగ్గగా 41వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిర్మలా ఆర్థిక మంత్రిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్ లగార్డ్ 2వ ర్యాంకులో నిలబడ్డారు. 55వ స్థానంలో HCL అధినేత శివ్ నాడార్ కుమార్తె రోష్నీ నాడార్ మల్హోత్రా నిలిచారు. ఇదే జాబితాలో బయోకాన్ (Biocon) ఎండీ కిరణ్ మజుందార్ షా 68వ ర్యాంక్ సంపాదించారు. గత కొన్నేళ్లుగా కిరణ్ శక్తివంతమైన మహిళల జాబితాలో కొనసాగుతున్నారు. ల్యాండ్ మార్క్ గ్రూప్ చైర్మన్ రేణుకా జగ్టియానీ ఈ జాబితాలో 98వ ర్యాంక్ లో నిలిచారు.

Covid-19పై పోరాటం
ఓవైపు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుండగా పలువురు శక్తివంతమైన మహిళలు ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో తమదైన ముద్ర వేశారని ఫోర్బ్స్ ప్రశంసించింది. ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్టులో 17 మంది కొత్తవారికి చోటు లభించింది. కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొంటూ తమ దేశ సత్తా చాటిన మహిళాధినేతగా న్యూజిల్యాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ 32వ స్థానంలో నిలిచారు. బిల్ గేట్స్ సతీమణి, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో ఛైర్ మిలిందా గేట్స్ ఫోర్బ్స్ జాబితాలో 5వ స్థానంలో నిలిచారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చుక్కలు చూపించిన యూఎస్ స్పీకర్ నాన్సీ పలోసీ ఈ జాబితాలో 7వ స్థానం సంపాదించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 39వ స్థానంలో నిలవగా, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II (Queen Elizabeth) 46 వ స్థానంలో నిలిచారు. ఇక కళాకారులైన రిహన్నా కు 69వ ర్యాంక్, బియాన్స్ కు 72వ ర్యాంక్ దక్కింది.
Published by:Nikhil Kumar S
First published: