హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

#MissionPaani | హర్ ఘర్ జల్... 2024 నాటికి ప్రతి ఇంటికీ నీళ్లు...కేంద్రం ప్రకటన

#MissionPaani | హర్ ఘర్ జల్... 2024 నాటికి ప్రతి ఇంటికీ నీళ్లు...కేంద్రం ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

#MissionPaani | హర్ ఘర్ జల్ అనే నినాదంతో ముందుకు సాగుతామని... 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

    దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నీటి కొరతపై కేంద్రం దృష్టి పెట్టింది. దేశంలోని ప్రతి ఇంటికి మంచి నీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నీటిని సంరక్షించడంతో పాటు అందరికీ సురక్షితమైన నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇందుకోసం జలశక్తి పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆమె తెలిపారు. ఈ కొత్త శాఖ నీటి వనరులపై దృష్టి పెడుతుందని వివరించారు. ఇప్పటివరకు నీటి వనరుల కోసం పని చేస్తున్న అనేక శాఖలు ఈ కొత్త మిషన్ కోసం కలిసి పని చేస్తాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని వెల్లడించారు.

    హర్ ఘర్ జల్ అనే నినాదంతో ముందుకు సాగుతామని... 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నీటి వనరులను వినియోగించుకుంటామని అన్నారు. దేశవ్యాప్తంగా నీటి కొరత ఎక్కువగా ఉన్న 1592 బ్లాక్లులు, 256 జిల్లాలను ప్రభుత్వం గుర్తించిందని.. ఇందుకోసం అదనంగా మరిన్ని నిధులను వాడతామని అన్నారు. దేశంలో నీటి కొరతను దృష్టి పెట్టుకుని నీటి సంరక్షణ కోసం ఇప్పటికే న్యూస్18 మిషన్ పానీ క్యాంపెయిన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం కూడా నీటి కొరతను అధిగమించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Mission paani, Nirmala sitharaman, Pm modi, Union budget 2019-2020, Water conservation