హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

CM Nitish : సీఎం-స్పీకర్ మధ్య మాటల యుద్ధం..దద్దరిల్లిన అసెంబ్లీ

CM Nitish : సీఎం-స్పీకర్ మధ్య మాటల యుద్ధం..దద్దరిల్లిన అసెంబ్లీ

Nitish Kumar Vs Sinha : బీహార్​ శాసనసభ బడ్జెట్​ సమావేశాల్లో సోమవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ విషయంపై స్పీకర్​, ముఖ్యమంత్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ విపక్షంతో కుమ్మక్కయి తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సహకరిస్తున్నారని సీఎం నితీష్ కుమార్ ఫైరయ్యారు.

ఇంకా చదవండి ...

Bihar Assembly : స్పీకర్ అంటే సీఎం ఏం చెబితే అది చేస్తారు... ఎవరిని సస్పెండ్ చేయమంటే వారిని చేస్తారు..ఎప్పుడు వాయిదా వేయమంటే అప్పుడు వేస్తారనేది సాధారణంగా మనం నిత్యం చూస్తుంటాం. అదే సమయంలో అధికారపక్షానికి ఇబ్బంది వస్తే స్పీకర్ ఎలా డిఫెండ్ చేస్తారో కూడా చూస్తూ ఉన్నాం. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు మాత్రం అలాంటి అదృష్టం లేదు. బీహార్​ శాసనసభ బడ్జెట్​ సమావేశాల్లో సోమవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ విషయంపై స్పీకర్​, ముఖ్యమంత్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ విపక్షంతో కుమ్మక్కయి తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సహకరిస్తున్నారని సీఎం నితీష్ కుమార్ ఫైరయ్యారు. క్రమంలోనే విపక్షాలతో పాటు అధికార కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యేలు సైతం నిరసనలు చేపట్టటం వల్ల సభ దద్దరిల్లింది..

గత నెలలో లఖీసరాయ్​ లో సరస్వతి పూజా ఉత్సవాల సమయంలో ఇద్దరు వ్యక్తులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే ఈవెంట్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇద్దరు అమాయకులను బలిపశువులను చేసి వారిపై పోలీసులు కేసు నమోదుచేశారని స్పీకర్ అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్మ​కు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై సభలో అసహనం వ్యక్తం చేశారు స్పీకర్​. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీనికి విపక్షాలతో పాటు అధికార కూటమిలోని బీజేపీ సైతం మద్దతు తెలిపింది. పోలీసులు లఖిసరాయి అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు..దీనిపై మాకంటే సీఎంకే ఎక్కువ తెలిసి ఉంటుంది.. మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను అని స్పీకర్ అనడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. శాంతి భద్రతల అంశాన్ని సభలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. "ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగం ద్వారా నడుస్తుంది. ఏ నేరమైనా కోర్టుకు వెళ్తుంది, శాసనసభ పరిధిలోకి రాదు. అనవసరంగా ఈ అంశాన్ని సభలోకి తీసుకురాకూడదు. మా ప్రభుత్వం ఎవరి పట్ల పక్షపాతంగా వ్యవహరించదు. సమాధానం చెబుతున్నప్పుడు సభలో గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు. సభను ఇలాగే నడపాలని మీరు అనుకుంటున్నారా? ఇలాగే నడపాలని అనుకుంటే మేము సభను ముందుకు సాగనీయం. చర్చలు జరగాల్సిన తీరు ఇది కాదు'" అని నితీష్ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై విరుచుకపడ్డారు.

ALSO READ : Fire Incident : జమ్మూలో భారీ పేలుడు..నలుగురు మృతి,15మందికి తీవ్ర గాయాలు

నితీష్ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్.. '' సభలో లేవనెత్తాల్సిన అంశాలు, సభ ఏవిధంగా నడిపించాలనేది మీరు చెప్పటమేంటి. మీరంతా కలిసే నన్ను అసెంబ్లీ స్పీకర్ చేశారు. ఇంతటి ఉన్నత స్థానంలో కూర్చున్నప్పటికీ నా ప్రాంతానికి సంబంధించిన అంశానని నేను ప్రస్తావించలేకపోతున్నాను. సభ్యులందరినికీ సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది'' అని అన్నారు. స్పీకర్ సమాధానం ఇచ్చినా ముఖ్యమంత్రి వెనక్కి తగ్గలేదు. సీఎం-స్పీకర్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధంతో కొద్దిసేపు సభలో గందరగోళం ఏర్పడింది.

బీహార్‌ లో బీజేపీ - జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. బీజేపీకి అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని జేడీయూ నేత నితీష్ కుమార్‌కు ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని నితీష్‌కు ఇచ్చినప్పటికీ ... స్పీకర్ పదవి సహా కీలకమైన అన్ని పదవులు బీజేపీ దగ్గరే ఉన్నాయి.

First published:

Tags: Bihar, Nitish Kumar

ఉత్తమ కథలు