సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల కారణంగా ఇంకా పలు ప్రాంతాలు నీటి ప్రవాహంలో ఉండడం, పట్టాలు నీట మునగడం వంటి కారణాలతోనే రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

news18-telugu
Updated: August 13, 2019, 8:18 AM IST
సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లు రద్దు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.  పశ్చిమ, దక్షిణ మధ్య భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పశ్చిమ రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇవాళ 14 రైళ్లను, రేపు 13, 15న 8, 16న 5, 17,18 తేదీల్లో 3, 19న ఒక రైలు సర్వీసును రద్దు చేసినట్టు పేర్కొంది. భారీ వర్షాల కారణంగా ఇంకా పలు ప్రాంతాలు నీటి ప్రవాహంలో ఉండడం, పట్టాలు నీట మునగడం వంటి కారణాలతోనే రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇవాళ సికింద్రాబాద్ నుంచి రాజ్‌కోట్ వెళ్లాల్సిన రైలుతోపాటు, పోర్‌బందర్-సికింద్రాబాద్ రైలు, రేపు రాజ్‌కోట్ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి పోర్‌బందర్ వెళ్లాల్సిన రైళ్లు రద్దయ్యాయి. అలాగే, 15న రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌, 17న ఇండోర్‌-లింగంపల్లి‌, 18న లింగంపల్లి-ఇండోర్‌ మధ్య నడవాల్సిన రైళ్లు రద్దైన వాటి జాబితాలో ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>