రైతులకు పిడుగులాంటి వార్త...భారీగా పెరగనున్న ఎరువుల ధరలు

ఈ పరిస్థితుల్లో వ్యవసాయదారులు, కూలీల ఆదాయాలు మరింత మెరుగుపడే దిశగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండాలని కోరుకుంటున్నారు.

వరి, సోయాబీన్, ప్రత్తి, చెరకుతో ఇతర పంటలకు పొటాష్ ఎరువులు తప్పనిసరి. ఐతే ఎరువుల ధరలు పెరుగుతాయన్న అంచనాలతో ఆయా పంటలు వేసే రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • Share this:
    వర్షాలు ఎప్పుడు పడతాయా..ఎప్పుడు పంటలు వేద్దామా..అని ఎదురుచూస్తున్న రైతన్నకు పిడుగులాంటి వార్త ఇది. ఇప్పటికే రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయన్న వాతావరణశాఖ అంచనాలతో అన్నదాతలు నిరాశలో ఉన్నారు. దీనికి తోడు ఈసారి ఎరువులు ధరలు భారీగా పెరబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పొటాష్‌కు ఉన్న డిమాండ్, పెరిగిన ముడి పొటాష్ ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడమే దీనికి కారణం..! ఫలితంగా ఈసారి ఎరువుల ధరలు 10 శాతం మేర పెరగనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

    మన దేశంలో ప్రతి ఏటా 32 మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగిస్తారు. ఇందులో నాలుగో వంతను మాత్రమే విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. అదే ముడి పొటాష్‌ను మాత్రం పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పొటాష్ ఎరువు ధరలు పెరగనున్నాయి. గత ఏడాదితో పోల్చితే డై అమ్మోనియం ఫాస్పేట్ (DAP) ధరలు 8-10శాతం, మురియేట్ ఆఫ్ పొటాష్ (MOP) ధరలు 8శాతం, నైజ్రోజన్ ఫాస్పరస్ అండ్ పొటాష్ (NPK) ధరలు 7-8 శాతం పెరిగే అవకాశముంది. 50 కేజీల DAP ధర రూ.1425-1450, MOP ధర రూ.800, NPK బస్తా ధర రూ.850-1250 వరకు ఉండవచ్చు.

    యూరియా ధరల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కానీ వరి, సోయాబీన్, ప్రత్తి, చెరకుతో ఇతర పంటలకు పొటాష్ ఎరువులు తప్పనిసరి. ఐతే ఈ ఎరువుల ధరలు పెరుగుతాయన్న అంచనాలతో ఆయా పంటలు వేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంట దిగుబడి లేక, సరైన మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. దీనికి తోడు ఎరువుల ధరలు కూడా పెరిగితే అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని వాపోతున్నారు. ఎరువుల ధరలను పెంచకుండా తమను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.


    First published: