మహిళా కాలేజీలో అమానుషం.. ప్రిన్సిపాల్ ఎదుటే ఆ పని..

వంటగదిలో వాడిన నెలసరి న్యాప్‌కిన్స్‌ను పాడేశారన్న కోపంతో విద్యార్థినులను దుస్తులు విప్పి పరీక్షించారు. ప్రిన్సిపాల్ ఎదుటే బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి అలా చేయడంతో విద్యార్థినులు సిగ్గుతో కుంగిపోయారు.

news18-telugu
Updated: February 14, 2020, 3:18 PM IST
మహిళా కాలేజీలో అమానుషం.. ప్రిన్సిపాల్ ఎదుటే ఆ పని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుజరాత్‌లో ఓ మహిళా కాలేజీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఎవరికి నెలసరి వచ్చిందో తెలుసుకునేందుకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎదుటే ఒక్కో బాలికను బాత్‌రూమ్‌కు తీసుకెళ్లి పరీక్షించిన ఉదంతం. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలోని ఓ మహిళా కాలేజీలోని కిచెన్ రూమ్‌లో వాడిన శానిటరీ న్యాప్‌కిన్స్‌ను కాలేజీ వార్డెన్ గుర్తించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పడంతో ఆయన ఆగ్రహించారు. కాలేజీ నిబందనల ప్రకారం నెలసరి సమయంలో విద్యార్థినులు మిగతా వారితో కలవొద్దు. వంట గది, దేవుడి గదిలోకి ప్రవేశం నిషిద్ధం. ఈ క్రమంలో వాడిన న్యాప్‌కిన్స్‌ కన్పించడంతో ప్రిన్సిపాల్ ఆగ్రహంతో ఆ పని చేసేందేవరో తెలుసుకోవాలని భావించాడు. విద్యార్థులందరినీ పిలిచి తప్పు చేసిందెవరో చెప్పాలంటూ విద్యార్థినులను అడిగాడు. దాంతో ఆ పని చేసింది తామేనంటూ ఇద్దరు విద్యార్థినులు అంగీకరించారు. అయితే అసలు విషయం చాలా పెద్దదని అనుమానించిన  ప్రిన్సిపాల్.. ఒక్కో విద్యార్థిని బాత్‌రూమ్‌కు తీసుకెళ్లి పరీక్షించారు.

మహిళా టీచర్లు వారి దుస్తులు తొలగించి ప్రిన్సిపాల్ ఎదురుగానే పరీక్షించారు. దీంతో విద్యార్థునులు సిగ్గుతో తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ విషయంపై కాలేజీ ట్రస్టీకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యంగా మారిందని విద్యార్థినులు వాపోయారు. పైగా దీన్ని ఇక్కడితో వదిలేయాలని ఉచిత సలహా ఇచ్చిరాని విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు. విషయం యూనివర్సిటీ అధికారుల దృష్టికి రావడంతో ఘటనపై త్రీసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు సైతం కాలేజీ యాజమాన్యంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు