Home /News /national /

FEDERAL FRONT CAN THE BJP BE RETAINED WHAT IS THE STRENGTH AND WEAKNESS OF THE REGIONAL ALLIANCE EVK

Regional Alliance: బీజేపీని నిలువ‌రించగ‌ల‌రా.. ప్రాంతీయ కుట‌మి బ‌లం, బ‌ల‌హీన‌త ఏమిటీ?

ప్ర‌తీకాత్మక చిత్రం

ప్ర‌తీకాత్మక చిత్రం

Regional Alliance | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) ముంబైకి వెళ్తున్నారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి ముంబైకి బయల్దేరతారు. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ప్రాంతీయ కూట‌మి చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) ముంబైకి వెళ్తున్నారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి ముంబైకి బయల్దేరతారు. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ప్రాంతీయ కూట‌మి చ‌ర్చ జోరుగా సాగుతోంది. దేశంలో కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ హవా నడుస్తోంది. ప్ర‌స్తుతం న‌రేంద్ర మోదీ (Narendra Modi) స్థాయి జాతీయ నేత ఇత‌ర పార్టీల్లో లేరు. మోదీ త‌రువాత ఆస్థాయిలో నాయ‌క‌త్వం రాహుల్ గాంధీ (Rahul Gandhi) కే ఉన్న‌ట్టు ప‌లు స‌ర్వేలు ఇప్ప‌టికే వెల్ల‌డించాయి. కాంగ్రెస్ మోదీ ప్ర‌భుత్వాన్ని స‌రిగా నిలువ‌రించ లేక‌పోతుంద‌ని ప్రాంతీయ కూట‌మి అవ‌స‌రం ఉంద‌ని సీఎం కేసీఆర్ తాజాగా వ్యాఖ్య‌నించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు ఆదివారం మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక్రేను క‌లుస్తున్నారు.

    EV Charging Station: పెరుగుతున్న ఈవీ చార్జింగ్ స్టేష‌న్‌లు.. ఎక్కువ ఎక్క‌డున్నాయో తెలుసా?

    ఈ కూట‌మి విజ‌య‌వంత అవుతుందా.. కూట‌మి బ‌లం, బ‌ల‌హీన‌త‌లు ఏమిటి అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ముందుగా కూట‌మీ ఏర్పాటు చేస్తున్నా నాయ‌కులు ఆయా ప్రాంతాల్లో బ‌ల‌మైన నాయ‌కులే.. స్టాలిన్‌, కేసీఆర్‌, మ‌మ‌తా బెన‌ర్జీ, శ‌ర‌ద్ ప‌వార్‌. ఆయా ప్రాంతాల్లో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌గ‌ల‌రు.. క‌ష్ట ప‌డితే మంచి సీట్లు సాధించ‌గ‌ల‌రు. ప్ర‌స్తుతం ఇది మాత్ర‌మే ఈ కూట‌మి బ‌లం.

    ముఖ్యంగా కూట‌మి బ‌ల‌హీన‌త.. ఉమ్మ‌డి నాయ‌కుడు. బీజేపీ (BJP) నుంచి మోదీ ఉన్న‌ప్పుడు ఇటువైపు ఆ స్థాయి నేత‌ను కూట‌మి ఎన్నుకోవాలి. అంద‌రూ ప్ర‌ధాని అభ్య‌ర్థులే కావ‌డం.. ఉమ్మ‌డి నాయ‌కుడిని ఎన్నుకోవ‌డం క‌ష్టం. ముందుగా ఎలెక్ష‌న్‌లో గెలిచాకా ఉమ్మ‌డి నాయ‌కుడిని ఎన్నుకొవాల‌నే భావిస్తున్నాయి. కానీ అలా చేస్తే మ‌ళ్లీ మోదీకి పోటీ లేన‌ట్టే అని ప్ర‌జ‌ల‌కు చెప్పిన‌ట్టు అవుతుంది. కూటమి ముందుగా మోదీకి ఇటు వైపు ఎవ‌రు అని తేల్చుకోవాలి.

    అంద‌రూ కూట‌మిగా ఏర్ప‌డి అభ్య‌ర్థి పెట్టినా.. రాహుల్ గాంధీ మాత్ర‌మే 2014 నుంచి మోదీని పూర్తిగా వ్య‌తిరేకిస్తూ పోస్టుల‌, ప్ర‌క‌ట‌నలు, ప్ర‌చారం చేశారు. ఇత‌ర ప్రాంతీయ నాయ‌కులు ఎవ్వ‌రూ ఏదో ఓ సంద‌ర్భంలో మోదీతో అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన వారే. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీకే ద‌క్క‌ని ఇమేజ్‌ ప్రాంతీయ కూట‌మి స‌భ్యుల‌కు ద‌క్కుతుందా అనేది ప్ర‌శ్న‌.

    Assembly Election 2022: మోదీని రంగంలోకి దింపారు.. బీజేపీ వ్యూహం ఫ‌లించేనా?

    అయితే అన్ని పార్టీల నాయ‌కులు జాతీయ రాజ‌కీయాల‌ (National Politics) పై దృష్టి పెట్టే స్థితి లేక పోవ‌డం. ఆయా రాష్ట్రాల్లో వీరి కార‌ణంగా అధికారంలోకి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రానికి దూరం అయితే స్థానికంగా అధికారానికి ఇబ్బందులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ప్రాంతీయ నాయ‌కులు జాతీయ స్థాయిలో చ‌క్ర త‌ప్పే ప్ర‌య‌త్నంలో సొంత రాష్ట్రాల్లోనే ఓడిపోయిన వారూ ఉన్నారు. ఇటు రాష్ట్రంలో పార్టీని కాపాడుకుంటూనే.. జాతీయ రాజ‌కీయాలు చేయ‌డం మాత్రం అంత సుల‌భం కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి కూట‌మి గెలుస్తుందా.. లేదా ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Congress, Mumbai, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు