FEDERAL BANK AND NETWORK 18S INDIAS LARGEST COVID 19 VACCINE AWARENESS DRIVE SANJEEVANI ANTHEM TO LAUNCH ON JUNE 21ST WATCH IT HERE BA
Sanjeevani Anthem: భారతదేశపు భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ సంజీవని ప్రచార గీతం సోమవారం ఆవిష్కరణ
సంజీవని ప్రచార గీతం రేపే ఆవిష్కరణ
“టీకా వేసుకో” అంటూ సాగే ఈ మెలొడీ అందరినీ వ్యాక్సిన్ వేసుకునేలా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రచార గీతానికి సంబంధించిన టీజర్ విడుదలైంది, ఈ పాటలో ఉన్న సకారాత్మక ధోరణిని, శక్తిని ఎవరైనా ఫీల్ కావచ్చు.
సంప్రదాయానికి భిన్నంగా, మొట్టమొదటిసారిగా డిజిటల్ ఇనిషియేటివ్ ద్వారా, Federal Bank (ఫెడరల్ బ్యాంక్), Network18 (నెట్వర్క్ 18) వారు వ్యాక్సిన్ అవగాహన కోసం నిర్వహిస్తోన్న డ్రైవ్ ‘Sanjeevani: A shot of life’ (‘సంజీవని: ఎ షాట్ ఆఫ్ లైఫ్’)కు సంబంధించిన ప్రచార గీతం జూన్ 21, సోమవారం ఉదయం 11.00 గంటలకు అన్ని Network18 (నెట్వర్క్ 18) ఛానళ్లలో విడుదలకానుంది.
ఈ గ్రాండ్ వర్చువల్ ఆవిష్కరణకు ఆనంద్ నరసింహన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాను. అలాగే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్దన్ సమక్షంలో ప్రముఖ కంపోజర్, గాయకులు శంకర్ మహదేవన్, ప్రచార అంబాసిడర్ సోనూసూద్లు ప్రచార గీతాన్ని ఆవిష్కరించనున్నారు.
అలాగే ఈ ప్రచార గీతం కోసం పని చేసిన గేయరచయిత తనిష్క్ నబార్, గాయకులు హర్షదీప్ కౌర్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్, ఇంకా ఇతర ప్రముఖ వ్యక్తులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రచార గీతాన్ని విడుదల చేసి, కొవిడ్-19కు వ్యతిరేకంగా దేశమంతా కలిసి పోరాడటమే దీని వెనక ఉన్న లక్ష్యం. వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనకాడుతున్న వారి మూఢనమ్మకాలను పారద్రోలడానికి ఈ ప్రచార గీతం ప్రయత్నం చేస్తోంది. ‘టీకా’ (వ్యాక్సిన్), లాంటి పదాలను ఉపయోగించిన, ఈ చక్కని ప్రచార గీతం ద్వారా వ్యాక్సిన్ వేసుకోవడానికి తమ వంతు రాగానే అందరూ వ్యాక్సిన్ వేసుకునేలాగా ప్రోత్సహిస్తోంది.
“టీకా వేసుకో” అంటూ సాగే ఈ మెలొడీ అందరినీ వ్యాక్సిన్ వేసుకునేలా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రచార గీతానికి సంబంధించిన టీజర్ విడుదలైంది, ఈ పాటలో ఉన్న సకారాత్మక ధోరణిని, శక్తిని ఎవరైనా ఫీల్ కావచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.