కేరళలో అంటరాని వారిగా డాక్టర్లు, నర్సులు..!

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:46 PM IST
కేరళలో అంటరాని వారిగా డాక్టర్లు, నర్సులు..!
  • News18
  • Last Updated: June 6, 2018, 3:46 PM IST
  • Share this:
దేశంలో నిపా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. కేరళలోని కోజికోడ్ లో నిపా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. నిపా లక్షణాలతో మరికొందరు జిల్లా ఆస్పత్రిలో చేశారు. ఈ వైరస్ వ్యాప్తితో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రోగుల బాగోగులు చూసే ఓ నర్సు కూడా చనిపోవడంతో.. భయంతో వణికిపోతున్నారు. ఆస్పత్రిలో ఇప్పటికే చాలా మంది చనిపోయారని... వారి నుంచి సిబ్బందికి వైరస్ వ్యాపిస్తోందని ఆందోళన చెందుతున్నారు. అందుకే వీలైనంత వరకు డాక్టర్ల, నర్సులకు దూరంగా ఉంటున్నామని  స్థానికులు చెబుతున్నారు.

జనావాస ప్రాంతాల్లో ఆస్పత్రి సిబ్బందిని స్థానికులు బహిష్కరిస్తున్నారు. కోజికోడ్ జిల్లాలోని పెరంబ్రా తాలుకా ఆస్పత్రికి చెందిన పలువురు నర్సులు పబ్లిక్ బస్సులో ఎక్కడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు. వారిని బస్సులో ఎక్కించుకోకూడదని గొడవ చేశారు. ఆటో డ్రైవర్లు సైతం వైద్యులు, నర్సులను ఎక్కించుకోవడం లేదు. అటు స్మశాన వాటికల్లో డెడ్ బాడీలను తగలబెట్టేందుకు కూడా సిబ్బంది భయపడుతున్నారు. మవూర్ రోడ్డులోని స్మశనా వాటికలో ఓ డెడ్ బాడీని దహనం చేసేందుకు నిరాకరించిన ఇద్దరు సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.నిపా భయంతో కోజికోడ్ జిల్లా ఆస్పత్రితో ఇన్ పేషెంట్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఆరోగ్యంగా ఉన్న స్థానిక ప్రజలు.. వైద్యులు, నర్సులకు దూరంగా ఉంటున్నారు. అసలు జిల్లా ఆస్పత్రి వైపు వెళ్లేందుకే ధైర్యం చేయడం లేదు. ఐతే రోగులకు సేవ చేసే తమను అంటరానివారిగా చూడడంపై నర్సులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమను మెచ్చుకోవాల్సింది పోయి.. దూరం పెట్టడం సబబు కాదని వాపోతున్నారు. దుష్ప్రచారాన్ని నమవద్దని కోరుతున్నారు.ప్రజల్లో నెలకొన్న భయాందోళలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోజికోడ్ జిల్లా ఆస్పత్రి అధికారి జయశ్రీ వాసుదేవన్ అభిప్రాయపడ్డారు. వందతులను విశ్వసించవద్దని ప్రజలను కోరారు. స్థానికుల్లో నెలకొన్న అపోహలను తొలగించాల్సి అవసరం ఉందని బేబీ శిరీన్ అనే సామాజిక వేత్త తెలిపారు. నిపా వైరస్ కు సంబంధించి అసత్య ప్రచారం జరుగుతోందని, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.ప్రజల్లో ఆందోళన నేపథ్యంలో కేంద్రం కూడా అడ్వైజరీని జారీ చేసింది. గబ్బిలాల నుంచి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. భూమిపై పడి ఉన్న అపరిశుభ్రమైన పండ్ళు, సగం కొరికి ఉన్న పండ్లను తినవద్దని సూచించింది. తాడి, ఈత కల్లుకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని తెలిపింది. అటు పాడబడ్డ బావుల దగ్గరకు వెళ్లవద్దని సూచించింది.
First published: May 25, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...