ఇతడి చేతిలో ఉన్నది కూరగాయల మూటేం కాదు.. ఆ తండ్రి కంటి నిండా నీళ్లు.. గుండె నిండా బాధ.. మూడు కిలోమీటర్ల నడక..

కొడుకు శరీర భాగాల మూటతో నడుస్తూ వెళ్తున్న తండ్రి

తలకు ఓ గుడ్డ, చేతిలో ఓ మూట పట్టుకుని ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. ఇందులో వింతేముంది? రోజువారీ కూలీకి వెళ్లే వాళ్లు చేసేదే కదా? అని అనుకుంటే పొరపాటే. అతడు చేతిలో పట్టుకున్న మూటలో ఉన్నది కూరగాయలో, ఇంకేదో కాదు.

 • Share this:
  తలకు ఓ గుడ్డ, చేతిలో ఓ మూట పట్టుకుని ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. ఇందులో వింతేముంది? రోజువారీ కూలీకి వెళ్లే వాళ్లు చేసేదే కదా? అని అనుకుంటే పొరపాటే. అతడు చేతిలో పట్టుకున్న మూటలో ఉన్నది కూరగాయలో, ఇంకేదో కాదు. స్వయానా అతడి కొడుకు మృతదేహం తాలూకా శరీరభాగాలు. అవును, ఊహించని పరిస్థితుల్లో కొడుకు మరణిస్తే, ఆ మృతదేహంలో కేవలం కొన్ని భాగాలే మిగిలి ఉంటే, ఆ కన్న తండ్రి వాటిని మూట కట్టుకుని చేత్తో పట్టుకుని ఏకంగా మూడు కిలోమీటర్ల పాటు నడిచాడు. పోలీసులు కానీ, వైద్య విభాగం కానీ, అతడికి ఏమాత్రం సహాయం చేయలేదు. ఒంటరిగా నడుస్తూ, ఏడుస్తూ వెళ్తున్న అతడిని చూసి, స్థానికులు ఏమయిందా అని అడిగితే, ఒక్కసారిగా తన బాధనంతా చెప్పుకుని బోరుమన్నాడు. బీహార్ లోని కాథైర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  బీహార్ లోని భగల్పూర్ జిల్లాకు చెందిన నీరూ యాదవ్ అనే వ్యక్తికి హరైమ్ యాదవ్ అనే 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గోపాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్తాంగా గ్రామంలో ఉన్న ఓ నదిని హరైమ్ యాదవ్ బోట్ పై దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అతడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై ఆ పోలీస్ స్టేషన్ లో నీరూ యాదవ్ ఫిర్యాదు చేశాడు కూడా. అయితే అతడి మృతదేహం కాథైర్ జిల్లాలోని కుర్సెలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ఘాట్ వద్ద లభ్యమయిందని పోలీసులు సమాచారం అందించారు. నీరూ యాదవ్ అక్కడకు చేరుకుని, మృతదేహం పరిస్థితిని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. నదిలోని మొసళ్లు, బయటికొచ్చిన తర్వాత ఇతర జంతువులు ఆ శవాన్ని పీక్కుతున్నాయి. మృతదేహంలోని కొంత భాగం మాత్రమే మిగిలి ఉంది.
  ఇది కూడా చదవండి: ప్లీజ్.. నన్ను రెండో పెళ్లయినా చేసుకోమని కోరిన యువతి.. నో చెప్పిన ప్రియుడు.. ఆ భగ్న ప్రేమికురాలు ఎంతకు తెగించిందంటే..

  ఆ మృతదేహంపై ఉన్న వస్త్రాలను చూసి తన కుమారుడిదే అని ఆ తండ్రి గుర్తుపట్టాడు. పోలీసులు సమాచారం అయితే చెప్పారు కానీ, ఆ మిగిలి ఉన్న మృతదేహాన్ని తరలించేందుకు ఏమాత్రం ఏర్పాట్లు చేయలేదు. తాను కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ సిబ్బంది కానీ, మృతదేహం లభ్యమయిన పోలీస్ స్టేషన్ సిబ్బంది కానీ ఏమాత్రం ఏర్పాట్లు చేయలేదు. అంబులెన్స్ ను కూడా పిలవలేదు. దీంతో ఆ తండ్రి తన వెంట తెచ్చుకున్న ఓ గుడ్డలో మృతదేహంలో మిగిలి ఉన్న శరీర భాగాలను మూట కట్టుకున్నాడు. మూడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తన స్వగ్రామానికి వెళ్లాడు. అతడు రోడ్డు మీద బోరున విలపిస్తూ వెళ్తోంటే, దారిలో వెళ్తున్న వారు చలించిపోయారు. మీడియాకు సమాచారం అందించారు. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో కాథైర్ డీఎస్పీ అంబర్కాంత్ ఝా ఈ ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
  ఇది కూడా చదవండి: భర్తతో తెగదెంపులు.. పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్న 25 ఏళ్ల యువతికి ఓ వ్యక్తి పెళ్లి ప్రపోజల్.. చివరకు..
  Published by:Hasaan Kandula
  First published: