హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కూతురితో కలిసి టెన్త్ పరీక్షలు రాసిన తండ్రి....ఇద్దరు పాస్

కూతురితో కలిసి టెన్త్ పరీక్షలు రాసిన తండ్రి....ఇద్దరు పాస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పుదుచ్చేరికి చెందిన 48 ఏళ్ల సుబ్రమణియన్... పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఫీల్డ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అప్పట్లో ఏడోతరగతివరకు చదవి ఉద్యోగం సంపాదించిన సుబ్రమణియన్... ప్రమోషన్ కోసం టెన్త్ పాస్ అవ్వాలనుకున్నాడు.

  చాలామందికి టెన్త్ ఎగ్జామ్స్‌లో గట్టెక్కాలంటే కత్తి మీద సామే. అందుకే పదో తరగతి పరీక్షలంటే... పిల్లలు పుస్తకాల పురుగుల్లా మారిపోతారు. ఇక గ్రేడులు, ర్యాంకుల గోల మొదలయ్యాక.... టెన్త్ ఎగ్జామ్స్ అందరికీ ప్రస్టేజీయిస్ ఇష్యూగా మారిపోయింది. ఇదంతా ఈ జనరేషన్ వరకే. గతంలో మాత్రం పదో తరగతి పరీక్షలంటేనే... చాలా పెద్ద టెన్షన్. పిల్లల నుంచి వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ఉంటారు. అందుకే అప్పట్లో చాలామంది పెద్దవాళ్లు సైతం ఈ పరీక్షల్లో పాస్ కాలేక ఇప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లో ప్రయత్నిస్తున్నారు. అలాంటి పుదుచ్చేరికి చెందిన 48 ఏళ్ల సుబ్రమణియన్... పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఫీల్డ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అప్పట్లో ఏడోతరగతివరకు చదవి ఉద్యోగం సంపాదించిన సుబ్రమణియన్... ప్రమోషన్ కోసం టెన్త్ పాస్ అవ్వాలనుకున్నాడు.

  2017లో ప్రైవేటుగా 8వతరగతి చదివి పాస్ అయ్యాడు. తర్వాత టెన్త్‌లో పాస్ అవ్వాలని ప్రైవేటుగానే పరీక్ష కట్టాడు. హాజరయ్యి పరీక్ష కూడా రాశాడు. అయితే మూడు సబ్జెక్టుల్లో తప్పడంతో మళ్లీ సప్లమెంటరీలో పరీక్షలు రాశాడు. మళ్లీ తప్పాడు. దీంతో ఈ ఏడాది మార్చిలో తాజాగా జరిగిన టెన్త్ ఎగ్జామ్స్‌లో పరీక్ష రాసి పాస్ అయ్యాడు.అయితే ఈసారి సుబ్రమణియన్ రాసిన పరీక్షకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే తన కూతురు తిరిగున్నా కూడా ఈసారి టెన్త్ ఎగ్జామ్స్ రాసింది. ఆమె కూడా సక్సెస్ అయ్యింది. దీంతో తండ్రి కూతురిద్దరు కూడా పదోతరగతి ఒకేసారి పాస్ కావడంతో ఆ కుటుంబం ఆనందంతో నిండిపోయింది.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: National News, Puducherry

  ఉత్తమ కథలు