FASTag: గుడ్ న్యూస్... వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్స్ ఉచితం... తీసుకోండి ఇలా

FASTag | NHAI ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల దగ్గరే మీరు ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 1 వరకు మాత్రమే.

news18-telugu
Updated: November 22, 2019, 10:43 AM IST
FASTag: గుడ్ న్యూస్... వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్స్ ఉచితం... తీసుకోండి ఇలా
FASTag: గుడ్ న్యూస్... వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్స్ ఉచితం... తీసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ లేదా? అయితే మీకు శుభవార్త. వాహనదారులకు ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్‌ ఇవ్వాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI నిర్ణయించింది. ప్రతీ అకౌంట్‌కు సెక్యూరిటీ డిపాజిట్ కూడా లభిస్తుంది. వాహనదారులు ఎలక్ట్రానిక్ టోల్ పద్ధతికి మారేందుకు ఈ నిర్ణయం తీసుకుంది NHAI. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల్లో టోల్ గేట్ దాటే ప్రతీ వాహనానికి డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1 గడువుకు మరో వారం మాత్రమే ఉంది. ఇంకా చాలా వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ లేదు. దీంతో వాహనదారులను ప్రోత్సహించేందుకు ఫాస్ట్ ట్యాగ్ ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది NHAI.

దేశంలోని అనేక టోల్ ప్లాజాల దగ్గర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI పాయింట్ ఆఫ్ సేల్-PoS ఏర్పాటు చేసింది. అక్కడ వాహనదారులకు ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్ ఇస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ కోసం రూ.150 సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా NHAI భరిస్తుంది.
నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి


ఫాస్ట్ ట్యాగ్‌లు అమ్మేందుకు బ్యాంకులు టోల్ ప్లాజాల దగ్గర 27000 పాయింట్ ఆఫ్ సేల్-PoS ఏర్పాటు ఏర్పాటు చేయడం విశేషం. అయితే NHAI ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల దగ్గరే మీరు ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 1 వరకు మాత్రమే. ఇప్పటివరకు మొత్తం 537 టోల్ ప్లాజాల్లో 90% పైగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థ ఏర్పాటు చేశారని అంచనా. మిగతా టోల్ ప్లాజాల్లో కూడా ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. మీరు ఎస్‌బీఐలో ఫాస్ట్ ట్యాగ్ ఎలా కొనాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.



మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:
Loading...
Business Idea: రూ.50,000 పెట్టుబడితో ఫాస్ట్‌ట్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలా

Free Wifi: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 574 స్టేషన్లలో ఫ్రీ వైఫై... వాడుకోండి ఇలా

Tata Sky: అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఫ్రీగా ఇస్తున్న టాటాస్కై
First published: November 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...