Delhi Violence: పోలీసులపై విచక్షణారహితంగా దాడులు.. షాకింగ్ వీడియోలు

పోలీసులపై దాడులు

ఎర్రకోట వద్ద భయానక దృశ్యాలు కనిపించాయి. కొందరు ఆందోళనకారులు పోలీసులను తరిమితరిమికొట్టారు. పోలీసులు భయంతో నాలాలో దూకి ప్రాణాలు రక్షించుకున్నారు.

  • Share this:
    రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో మంగళవారం హింసాత్మక ఘటనలు చెలరేగిన విషయం తెలిసిందే. అనుమతించిన మార్గాల్లో కాకుండా ఆందోళనకారులు ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసుల బ్యారికేడ్లను తొలగించి అనూహ్యంగా ఎర్రకోటను ముట్టడించడంతో యావత్ దేశం షాక్‌కు గురయింది. పలువురు ఆందోళనకారులు ఎర్రకోటపై జెండాలు ఎగురవేశారు. ఆ సందర్భంగా ఎర్రకోట వద్ద భయానక దృశ్యాలు కనిపించాయి. కొందరు ఆందోళనకారులు పోలీసులను తరిమితరిమికొట్టారు. పోలీసులు భయంతో నాలాలో దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. రెయిలింగ్ నుంచి నాలాలోకి పడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. మరికొందరైతే పోలీసులను కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు.


    నంగ్లోలి ప్రాంతంలోనూ పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు.

    నంగ్లోలి-నజఫ్‌గఢ్ రోడ్డులో పలు వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పబ్లిక్ ట్రాన్‌పోర్ట్ బస్సులతో పలు ప్రైవేట్ వాహనాలపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు.



    ఢిల్లీలోని ముకర్బా చౌక్, ఘాజీపూర్, ఏ పాయింట్ ఐటీవో, సీమాపూరి, నంగ్లోలి, టిక్రీ బోర్డర్, ఎర్రకోట ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి 4 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని తెలిపారు. ఆందోళకారుల దాడుల్లో 30 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయని పేర్కొన్నారు. ఢిల్లీలో హింస నేపథ్యంలో అదనపు బలగాలను రప్పించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తన పారా మిలటరీ బలగాలు మోహరించాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: