Home /News /national /

FARMERS WHO DIED BY SUICIDE ARE COWARDS SAYS KARNATAKA MINISTER SHOCKING REMARKS BA

రైతు ఆత్మహత్యలపై కర్ణాటక మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పంట నష్టాలు, అప్పులతో సతమతమై ఆత్మహత్యలు చేసుకునే రైతుల మీద కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    పంట నష్టాలు, అప్పులతో సతమతమై ఆత్మహత్యలు చేసుకునే రైతుల మీద కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారంతా ‘పిరికిపందలు’గా అభివర్ణించారు. ఓ వైపు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక మంత్రి బీసీ పాటిల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ‘ఆత్మహత్యలు చేసుకునే రైతులు పిరికిపందలు. తన భార్య, పిల్లలను చూసుకోలేని పిరికివాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం నీళ్లలో పడితే ఈత కొట్టాల్సి. గెలవాలి.’ అని పాటిల్ వ్యాఖ్యానించినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. వెదురు మొక్కల పెంపకం చేసే రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ వ్యాపారం ఎంతో లాభసాటిదని, కానీ, కొందరు పిరికివారికి అది తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయం ఎంత లాభసాటిదో చెప్పేందుకు ఆయన ఓ ఉదాహరణ కూడా చెప్పారు. రైతుల భార్యలు మంచి బంగారుగాజులు ధరిస్తారని, అదే తన వాదనకు బలమని చెప్పారు. ‘నేను ఆ మహిళతో మాట్లాడా. ఆమె చేతికి బంగారు గాజులు ఎలా వచ్చాయని అడిగా. ఆమె ఏం చెప్పిందో తెలుసా. 35 ఏళ్ల కష్టానికి భూమాత నాకు ఇచ్చిందని చెప్పింది. ఇది విన్నాక కూడా మీలో ఆనందం కలగడం లేదా?’ అని పాటిల్ అన్నారు.

    తూర్పుగోదావరి జిల్లాలో క్లాస్ రూమ్‌లో ఇంటర్ విద్యార్థులు పెళ్లి

    విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

    రైతులు ఆత్మహత్యలపై కర్ణాటక మంత్రి బీసీ పాటిల్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉగ్రప్ప ఖండించారు. మంత్రి పాటిల్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఇది రైతులను అవమానించడమే. అందుకు మంత్రి క్షమాపణ చెప్పాలి.’ అని ఉగ్రప్ప డిమాండ్ చేశారు. ‘ఏ రైతు కూడా ప్రాణం తీసుకోవాలని అనుకోరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. వరదలు, కరువు, ఇదీ కారణం అని ఇంకా ఎవరూ గుర్తించడం లేదు. దానికి పరిష్కారం కూడా రావడం లేదు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాల్సింది పోయి మంత్రి ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం తప్పు.’ అని ఉగ్రప్ప అన్నారు.

    ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి..

    Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు 


    దేశంలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. 2019లో విడుదలైన డేటా ప్రకారం మహారాష్ట్రలో 3900, కర్ణాటక (1992), ఆంధ్రప్రదేశ్ (1029), మధ్యప్రదేశ్ (541), తెలంగాణ (499), పంజాబ్ (302) రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Farmers Protest, Karnataka, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు