Home /News /national /

FARMERS TRACTOR RALLY PUNJAB FARMER REACHES DELHI ON TRACTOR IN REVERSE GEAR SK

Tractor Rally: పంజాబ్ టు ఢిల్లీ.. ట్రాక్టర్‌పై రివర్స్ గేర్‌లో వెళ్లిన రైతు.. వీడియో వైరల్

రివర్స్‌లో ఢిల్లీ వెళ్తున్న రైతు

రివర్స్‌లో ఢిల్లీ వెళ్తున్న రైతు

జనవరి 26 గణతంత్ర దినోత్సం కావడం.. అదే రోజున రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

    దేశ రాజధానిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ శివారులో బైఠాయించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ చేర్పాటు చేసినా.. కేంద్రంతో 11 సార్లు రైతులు చర్చలు జరిపినా.. పరిష్కారం దొరకలేదు. కొత్త చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. దేశంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా జనవరి 26న గణతంత్రదినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీని తలపెట్టారు. అందుకోసం భారీగా రైతుల ట్రాక్టర్లతో తరలివెళ్తున్నారు. ఐతే పంజాబ్‌కు చెందిన ఓ రైతు మాత్రం రివర్స్ గేర్‌లోనే ఢిల్లీ వరకు వెళ్లాడు.

    పంజాబ్‌కు చెందిన ఆ రైతు కిసాన్ పరేడ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీకి బయలుదేరాడు. ఐతే అతడు అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. దేశం దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో రివర్స్ గేర్‌లో ఢిల్లీకి వెళ్లాడు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌ను ప్రతిబింబించేలా ఇలా చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    జనవరి 26న ఢిల్లీలో శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. 25వేల ట్రాక్టర్లతో కిసాన్ పరేడ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు షరుతులతో కూడిన అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. ఢిల్లీ శివారులోని ఘాజిపూర్, సింఘు, టిక్రీ నుంచి ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభమవుతుంది. ఐతే ఏయే మార్గాల్లో ర్యాలీ నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. జనవరి 26 గణతంత్ర దినోత్సం కావడం.. అదే రోజున రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Delhi, Farmers, Farmers Protest, New Agriculture Acts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు