Farmers Tractor Rally: ఢిల్లీలోకి ప్రవేశించిన ట్రాక్టర్‌ ర్యాలీ.. కిసాన్ పరేడ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఘాజీపూర్ సరిహద్దుల్లో బారికేడ్లు తొలగించేందుకు యత్నిస్తున్న రైతులను చెదరగొట్టడాని టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు(PTI Photo)

కేంద్ర వ్యవసాయ సంస్కరణ చట్టాల్ని రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన కిసాన్ గణతంత్ర పరేడ్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

  • Share this:
    కేంద్ర వ్యవసాయ సంస్కరణ చట్టాల్ని రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన కిసాన్ గణతంత్ర పరేడ్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అనుమతించిన సమయం కంటే ముందుగానే రైతులు ట్రాక్టర్‌లతో ఢిల్లీలోకి అడుగుపెట్టారు. కొన్నిచోట్ల పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. జాతీయ జెండాలు పట్టుకుని వ్యవసాయ సంస్కరణ చట్టాల్ని రద్దు చేయాలని రైతులు నినాదాలు చేశారు. సింఘు టిక్రీ సరిహద్దుల్లో పోలీసుల బ్యారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఓ దశలో రైతులను నియంత్రిందచేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ముకర్బా చౌక్‌లో పోలీస్ వాహనం పైకి ఎక్కిన నిరసనకారులు.. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసి బారికేడ్లను తొలగించారు. కర్నల్ బై పాస్‌లో రైతులు ఢిల్లీలోకి ప్రవేశించే క్రమంలో బారికేడ్లను తొలగించారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.

    ఘాజీపూర్ సరిహద్దుల్లో కూడా పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు ట్రాక్టర్లతో ఢిల్లీలోని ప్రవేశించిన రైతులపై స్వరూప్ నగర్‌లోని స్థానికులు పూల వర్షం కురిపించారు. ఇక, కిసాన్ గణతంత్ర పరేడ్‌లో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న సంగతి తెలిసిందే.

    ఇక, రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక... ఈ ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతించారు. ఢిల్లీ పోలీసులు రైతులకు 3 రోడ్లను కేటాయించారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఆందోళనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అయితే రైతులు ఉదయం 8 గంటల నుంచే ఢిల్లీలోకి ప్రవేశించేందుకు బయలుదేరడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: