నేడు వారణాసిలో రైతుల నామినేషన్... ప్రధాని మోదీకి పోటీ...

ప్రతీకాత్మక చిత్రం

Lok Sabha Election 2019 : మోదీకి పోటీ ఇచ్చే ఉద్దేశంతో కాకపోయినా, తమ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రైతులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మీద పోటీ చేస్తున్న రైతులు ఇవాళ నామినేషన్లు వెయ్యబోతున్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సుమారు 50 మంది రైతులు మోదీపై పోటీకి రెడీ అయ్యారు. మొత్తం 50 మంది వరకు పోటీ చేస్తామని ప్రకటించిన పసుపు రైతులు.. తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదనీ, పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తమ సమస్యను జాతీయ స్థాయిలో నేతలు గుర్తించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వారణాసిలో ప్రజలు తమకు మద్దతుగా నిలవాలనీ, రైతుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటానికి దన్నుగా ఉండాలనీ కోరారు.

మొదటిదశ లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి 178 మంది పసుపు రైతులు పోటీ చేశారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవిత మీద వారంతా పోటీకి దిగారు. అయితే, ఆ సమయంలో వారంతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులని కవిత ఆరోపించారు. పసుపు బోర్డు రావాలంటే నిజామాబాద్‌లో కాదని, వారణాసిలో నరేంద్ర మోదీ మీద పోటీ చేద్దామని పిలుపునిచ్చారు. దీంతో వారణాసిలో మోదీపై పోటీ వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందన్న ఆరోపణలొచ్చాయి.

పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించాలని, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుచేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పసుపు రైతులకు తమిళనాడు రైతులు కూడా మద్దతు పలికారు. తమిళనాడుకు చెందిన రైతులు కూడా మోదీపై పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో వారణాసిపై దేశవ్యాప్త చర్చ జరుగుతుందని, ఆ రకంగా తమ సమస్యలు దేశం దృష్టిని ఆకర్షిస్తాయని రైతులు ఆశిస్తున్నారు. సమస్యను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజెప్పడమే తమ ఉద్దేశం కానీ, రాజకీయంగా ఎలాంటి దురుద్దేశాలు లేవని రైతులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

మా సభలకు కావాలనే జంతువుల్ని పంపిస్తున్నారు... బీజేపీ కార్యకర్తలపై మాయావతి ఫైర్...


ఇండియాలోకి ఉగ్రవాదులు వస్తారని ఊహించాడట... ఫేక్ కాల్ చేసినందుకు అరెస్ట్...

బూత్ లెవెల్లో టీడీపీ సర్వే... పూర్తి వివరాలు కోరిన చంద్రబాబు... గెలుపు లెక్కలు తేల్చేందుకు...

నేడు హైదరాబాద్‌కి జగన్... పార్టీ నేతలతో కీలక సమావేశం... ఎన్నికల ఫలితాలపై చర్చ
First published: