Home /News /national /

FARMERS TO CONDUCT DAILY TRACTOR MARCH TO PARLIAMENT DURING WINTER SESSION STARTING FROM NOV 29 SAYS SAMYUKTA KISAN MORCHA MKS

farmers: శీతాకాల సమావేశాలు జరిగినంత కాలం ప్రతి రోజూ పార్లమెంటుకు ట్రాక్టర్ల ర్యాలీ

సాగు చట్టాలపై రైతుల నిరసన

సాగు చట్టాలపై రైతుల నిరసన

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసన ఉద్యమానికి ఏడాది పూర్తికానుండటంతో ఈనెల 26న దేశ వ్యాప్తంగా భారీ కార్యక్రమాలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈనెల 29 నుంచి శీతాకాల సమావేశాలు జరిగినన్ని రోజులూ పార్లమెంట్ భవనం వద్ద ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామన్నారు..

ఇంకా చదవండి ...
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26తో రైతుల నిరసనలు ప్రారంభమై ఏడాది కావొస్తుండటం, ఈ నెల 29 నుంచే పార్లమెంట్ సమావేశలు జరుగనున్న నేపథ్యంలో రైతు సంఘాలు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి. 40 రైతుల సంఘాల సమాఖ్య అయిన సంయుక్త్ కిసాన్ మోర్ఛా(ఎస్కేఎం) నేతలు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము చేస్తోన్న ఉద్యమం ఈనెల 26తో ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా ఆ రోజు ఢిల్లీ సరిహద్దుల్లోని శిబిరాలతోపాటు దేశవ్యాప్తంగా కిసాన్ పంచాయితీలు నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు చెప్పారు. ఉద్యమంలో అమరులైన 650 మంది రైతులను స్మరించుకుంటూ, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేలా 26నాటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. చట్టాలను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగినన్ని రోజులూ పార్లమెంట్ భవనం వద్ద ప్రతిరోజూ ట్రాక్టర్ల కవాతు నిర్వహిస్తామన్నారు.

‘ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ఎన్నిరోజులు జరిగితే అన్ని రోజులపాటు పార్లమెంట్ భవనం వద్ద ట్రాక్టర్ల కవాతు నిర్వహిస్తాం. గతంలో రిపబ్లిక్ డే నాడు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో హింస చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి ఎంపిక చేసిన 500 మంది రైతులతోనే పార్లమెంట్ భవనం వద్ద రోజూ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తాం’అని ఎస్కేఎం నేతలు చెప్పారు. బీకేయూ నేత రాకేశ్ టికాయత్ విడిగా చేసిన ఒక ప్రకటనలో.. సాగు చట్టాల వాపసుకు కేంద్రానికి ఈనెల 26 వరకే గడువిస్తున్నామని, 27 నుంచి అన్ని రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని హెచ్చిరించారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేయడం తెలిసిందే. ప్రభుత్వ అంగీకారంతో ఈ తేదీలు ఖరారైతే, ఉభయ సభల సెక్రటేరియట్లు శీతాకాల సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటిస్తాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Farmers, Farmers Protest, Parliament, Parliament Winter session, Tractors

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు