Home /News /national /

FARMERS SUPPORT NEW LAWS AND MEET AGRI MINISTER TOMAR IN DELHI SK

Agriculture Acts: కేంద్రానికి ఆ రైతుల మద్దతు.. వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తే ఉద్యమిస్తాం..

కేంద్రమంత్రితో రైతు సంఘం నేతలు భేటీ

కేంద్రమంత్రితో రైతు సంఘం నేతలు భేటీ

Agriculture Acts: 29 మంది సభ్యులతో కూడిన రైతుల బృందం వ్యవసాయమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్త చట్టాలు బాగున్నాయని.. వాటిని రద్దు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ కొత్త చట్టాలను వెనక్కితీసుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలను చేస్తామని స్పష్టం చేశారు

ఇంకా చదవండి ...
    ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వేలాది మంది అన్నదాతలు దేశ రాజధాని శివారులో ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి పలు రాజకీయ పార్టీలు, రైతుల సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతిస్తున్నాయి. 17 రోజులుగా రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఐతే కొందరు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనకేసుకొస్తున్నారు. శనివారం భారతీయ కిసాన్ యూనియన్ (మన్) బృందం ఢిల్లీలో కేంద్రవ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌తో సమావేశమై.. కొత్త బిల్లులకు మద్దతు తెలిపారు.

    29 మంది సభ్యులతో కూడిన రైతుల బృందం వ్యవసాయమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్త చట్టాలు బాగున్నాయని.. వాటిని రద్దు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ కొత్త చట్టాలను వెనక్కితీసుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలను చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు భారతీయ కిసాన్ యూనియన్ (మన్) హర్యానా యూనిట్ అధ్యక్షుడు గునీ ప్రకాశ్.. కేంద్రమంత్రి నరేంద్ర తోమర్‌కు వినతీ పత్రం అందజేశారు.


    '' ప్రభుత్వం ఒకవేళ కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. అన్ని జిల్లాలకు మెమోరాండం సమర్పించాం. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలను గత ప్రభుత్వం 2014 వరకు ఎందుకు అమలు చేయలేదు.? నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంది. మాకు కూడా ఉంది. మేం కొత్త చట్టాలకు మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న వారు వామపక్షాలకు చెందిన వ్యక్తులు. రైతుల ముసుగులో హింసను ప్రేరేపిస్తున్నారు.'' అని గునీ ప్రకాశ్ పేర్కొన్నారు.


    మరోవైపు ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని రైతులు నిర్ణయించారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రేపు జైపూర్- ఢిల్లీ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఎల్లుడి సింఘు సరిహద్దులో నిరాహార దీక్షను చేయబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 19 లోపు తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని. కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని తెగేసి చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agriculture, Delhi, Farmers Protest, New Agriculture Acts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు