హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మహాత్మా మన్నించు..ఢిల్లీలో రైతన్నపై విరిగిన లాఠీ..!

మహాత్మా మన్నించు..ఢిల్లీలో రైతన్నపై విరిగిన లాఠీ..!

రైతుల ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు (ఫైల్ ఫొటో)

రైతుల ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు (ఫైల్ ఫొటో)

సుమారు 70వేల మంది రైతులు ఇందులో పాల్గొన్నారు. అక్టోబరు 2న ఢిల్లీలోని కిసాన్‌ ఘాట్‌కు చేరుకొని ఆందోళన చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

  గాంధీ జయంతి రోజున ఢిల్లీ శివారులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 10 రోజులుగా మహాపాదయాత్ర చేస్తున్న రైతులు..ఇవాళ ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సిటీ శివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా బలగాలను మోహరించారు. ఐనప్పటికీ రైతులు వెనక్కి తగ్గకుండా..ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి..వాటర్ కెనాన్లను ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లు, భాష్ప వాయువు గోళాలను ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు.

  ర్యాలీలో పాల్గొన్న రైతులు ఆహారం, మంచి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కొందరు స్థానికులు అండగా నిలిచి..ఆహారపదార్థాలు అందిస్తున్నారు. కాగా, రైతుల ర్యాలీకి పలు పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి.

  భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ ర్యాలీ జరుగుతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి సెప్టెంబరు 23న ఈ ర్యాలీ ప్రారంభమైంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు, రుణాలు మాఫీ, పదేళ్లు పైబడిన ట్రాక్టర్లపై నిషేధం ఎత్తివేత సహా పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. సుమారు 70వేల మంది రైతులు ఇందులో పాల్గొన్నారు. అక్టోబరు 2న ఢిల్లీలోని కిసాన్‌ ఘాట్‌కు చేరుకొని ఆందోళన చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

  పోలీసుల వైఖరిపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నామని..ఎందుకు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల గురించి ప్రభుత్వానికి కాకుండా ఎవరికి చెప్పుకోవాలని..ప్రశ్నించారు. గాంధీ జయంతి రోజు ప్రపంచమంతటా అహింసా దినోత్సవం జరుగుతోంటే...ఢిల్లీ పోలీసులు మాత్రం రైతులను తరిమేస్తూ హింసకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఐతే రైతుల ర్యాలీకి ఢిల్లీ సీఎం మద్దతు ప్రకటించారు. పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. వారిని నగరంలోకి అనుమతించాాలని డిమాండ్ చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Farmers Protest, New Delhi

  ఉత్తమ కథలు