Home /News /national /

FARMERS SKU DEFER TRACTOR RALLY TO PARLIAMENT SCHEDULED ON 29 NOV MINISTER TOMAR ASKED FARMERS TO GO HOME MKS

Farmers : గేరు మార్చిన రైతులు -పార్లమెంట్‌కు ట్రాక్టర్ల ర్యాలీ వాయిదా -మళ్లీ సీన్‌లోకి వ్యవసాయ మంత్రి తోమర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సభ జరిగినంతకాలం ప్రతిరోజూ పార్లమెంట్ భవనం వద్దకు ట్రాక్లర్ల ర్యాలీ చేపడతామని, ఈనెల 29 నుంచే దీనిని కొనసాగిస్తామని గతంలో ప్రకటించడం తెలిసిందే. అయితే, సాగు చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం.. సభలో తొలిరోజే ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 29న తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా శనివారం నాడు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా నిరసనలు కొనసాగిస్తోన్న రైతులు (Farmers protest) తమ ఉద్యమకార్యాచరణలో కీలక మార్పులు చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల (parliament winter session) సందర్భంగా సభ జరిగినంతకాలం ప్రతిరోజూ పార్లమెంట్ భవనం వద్దకు ట్రాక్లర్ల ర్యాలీ చేపడతామని, ఈనెల 29 నుంచే దీనిని కొనసాగిస్తామని గతంలో ప్రకటించడం తెలిసిందే. అయితే, సాగు చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం.. సభలో తొలిరోజే ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 29న తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా శనివారం నాడు ప్రకటించింది. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులను ఉద్దేశించి మరోసారి కామెంట్లు చేశారు. వివరాలివి..

శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే సోమవారం నాడు పార్ల‌మెంట్‌ను ముట్ట‌డి చేసేందుకు రైతులు ప్లాన్ చేసిన నిరసనలు వాయిదా పడ్డాయి. సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ శీతాకాల స‌మావేశాల తొలి రోజునే ప్ర‌భుత్వం బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న నేపథ్యంలో రైతులు వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా నేత‌లు శనివారం మీటింగ్ నిర్వ‌హించారు. తొలిరోజు సభలోకి రద్దు బిల్లులు వెళుతున్నందున, పార్లమెంట్ మార్చ్ ను వాయిదా వేస్తున్నామని, అయితే ఎంఎస్పీ చట్టం ఇతర డిమాండ్లకు కేంద్రం అంగీకరించేదాకా ఆందోళన కొనసాగుతుందని ఎస్కేయూ నేతలు స్పష్టం చేశారు.

karimnagar mlc : టీఆర్ఎస్‌లో సరికొత్త వర్గం -అర్జున గుట్ట పుష్కరాల సాక్షిగా kcr: సర్దార్ తాజా బాంబు



రైతులు త‌మ ఆందోళ‌న‌ల‌ను విర‌మించాల‌ని కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ కోరారు. శీతాకాల స‌మావేశాల సమయంలో పార్లమెంట్ వద్ద నిరసనలకు రైతులు ప్లాన్ చేసిన దరిమిలా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి.. చట్టాలను కేంద్రం ఇప్పటికే రద్దు చేసినందున రైతులు ఆందోళ‌న విర‌మించి, ఇళ్లకు తిరిగివెళ్లాల‌ని తోమర్ అన్న‌దాత‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కితీసుకున్నందున ఆందోళ‌న కొన‌సాగించాల్సిన అవ‌స‌రం లేదని ఆయన అన్నారు. చర్చల ప్రక్రియ నిలిచిపోయిన తర్వాత నుంచి క్రమంగా రైతుల ఉద్యమంపై బైట్లు తగ్గించిన తోమర్ మళ్లీ ఇన్నాళ్లకు ప్రత్యక్షమయ్యారు.

shocking : మలద్వారం గుండా గాలిని పంప్ చేశారు -ఫ్యాక్టరీలో సరదాగా చేసిన పని చివరికిలా..



రైతుల డిమాండ్ల‌ను నెర‌వేర్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తాను హామీ ఇస్తున్నాన‌ని మంత్రి తోమర్ చెప్పారు. పంటల వైవిధ్యం, జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌, మ‌ద్ద‌తు ధ‌ర యంత్రాంగాన్ని ప‌టిష్టం చేయ‌డం వంటి ప‌లు అంశాల‌పై చ‌ర్చించేందుకు క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించార‌ని ఆయ‌న గుర్తుచేశారు. రైతు సంఘాల ప్ర‌తినిధులు కూడా ఈ క‌మిటీల్లో ఉంటార‌ని చెప్పారు. రైతులు పంట వ్య‌ర్ధాల‌ను ద‌గ్ధం చేయ‌డాన్ని నేర‌పూరిత చ‌ర్య‌గా చూడ‌రాద‌న్న‌ రైతు సంఘాల డిమాండ్‌ను కూడా ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని పేర్కొన్నారు. క‌మిటీ ఏర్పాటుతో ఎంఎస్‌పీపై రైతుల డిమాండ్ కూడా నెర‌వేరిన‌ట్టేన‌ని మంత్రి తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: Farmers, Farmers Protest, Parliament Winter session

తదుపరి వార్తలు