హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Priyanka Gandhi: రైతుల పట్ల ఏం మాటలవి... కేంద్రంపై ప్రియాంకా గాంధీ ఫైర్

Priyanka Gandhi: రైతుల పట్ల ఏం మాటలవి... కేంద్రంపై ప్రియాంకా గాంధీ ఫైర్

రైతుల పట్ల ఏం మాటలవి... కేంద్రంపై ప్రియాంకా గాంధీ ఫైర్

రైతుల పట్ల ఏం మాటలవి... కేంద్రంపై ప్రియాంకా గాంధీ ఫైర్

Priyanka Gandhi: నెలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ప్రియాంకా గాంధీ మద్దతుగా నిలిచారు. తాజాగా ఆమె కేంద్రంపై ఘాటుగా ఫైర్ అయ్యారు.

Priyanka Gandhi: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతుల పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతుగా నిలవట్లేదని విమర్శలు వస్తున్న సమయంలో... కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (Congress General Secretary) ప్రియాంకా గాంధీ స్పందించారు. కాంగ్రెస్ స్థాపన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న ఆమెను రిపోర్టర్లు ప్రశ్నించగా... ప్రియాంకా గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతుల గోడు వినాలని అన్నారు. ధర్నా చేస్తున్న వారిని కేంద్రం కించపరుస్తోందనీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు. "రైతులు ఏం చెబుతున్నారో కేంద్రం వినాలి. రైతుల పట్ల ఆ మాటలేంటి... అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు... ఇది చాలా తప్పు. ఓ యువ రైతు కొడుకు... సరిహద్దుల్లో సైనికుడై దేశానికి రక్షణ కల్పిస్తున్నాడు. రైతులు దేశం ఆకలి తీరుస్తున్నారు. అలాంటి వారి పట్ల కేంద్రం ఇలా మాట్లాడటం కరెక్టు కాదు. దీనికి కేంద్రం బాధ్యత వహించాల్సిందే" అంటూ తన వాణి వినిపించారు.


రాహుల్ పర్యటనతో వివాదం:

ఓవైపు తిండీ తిప్పలు మాని రైతులు దట్టమైన చలిలో ధర్నా చేస్తుంటే... ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం విదేశీ పర్యటనకు వెళ్లినట్లు వచ్చిన వార్తలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన వ్యక్తిగత కారణాలతో ఈ పర్యటనకు వెళ్లినా... ఇలాంటి సమయంలో రైతులతో ధర్నాలో పాల్గొనాల్సింది పోయి... విదేశాలకు వెళ్లడమేంటనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని రోజుల పాటు విదేశాల్లోనే రాహుల్ ఉంటారని కాంగ్రెస్ తెలపడం ఈ వివాదాన్ని రాజేసింది.

ఇది కూడా చదవండి: Facebook Love: ప్రేమ పేరుతో వల. యువతిపై గ్యాంగ్ రేప్

రాహుల్ టూర్‌పై కాంగ్రెస్ వర్గాలు స్పందించకపోయినా... రైతుల నుంచి మాత్రం కాంగ్రెస్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో... వాటికి బ్రేక్ వేస్తూ... తాము రైతుల పక్షానే ఉన్నామని చెబుతున్నట్లుగా కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రియాంకా గాంధీ. మరోవైపు ఇవాళ రైతులతో కేంద్రం ఆరోసారి చర్చలు జరపబోతోంది. అవి ఎంతవరకూ ఫలవంతం అవుతాయన్నది రాత్రికి తెలుస్తుంది.

First published:

Tags: Farmers Protest, New Agriculture Acts, Priyanka Gandhi, Rahul Gandhi

ఉత్తమ కథలు