హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farmers Protest: ‘రైతుల కష్టాలు చూడలేను..’ ఢిల్లీ బోర్డర్‌లో ‘సిక్కు గురువు’ ఆత్మహత్య

Farmers Protest: ‘రైతుల కష్టాలు చూడలేను..’ ఢిల్లీ బోర్డర్‌లో ‘సిక్కు గురువు’ ఆత్మహత్య

బాబా రామ్ సింగ్ (Image; Twitter)

బాబా రామ్ సింగ్ (Image; Twitter)

ఢిల్లీ సరిహద్దుల్లోని సోనిపట్‌లో రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న బాబా రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని ఓ గురుద్వారాలో మత ప్రబోధకుడిగా ఉన్న ఆయన గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.

ఢిల్లీ సరిహద్దుల్లోని సోనిపట్‌లో రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న బాబా రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని ఓ గురుద్వారాలో మత ప్రబోధకుడిగా ఉన్న ఆయన గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. 65 సంవత్సరాల బాబా రామ్ సింగ్ తన ఆత్మహత్యకు కారణాలు సూసైడ్ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు. కుండ్లీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సింఘు బోర్డర్‌కు ఇది సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైతుల ఉద్యమానికి ఈ సింఘు బోర్డర్ కేంద్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికి 21 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. బాబా రామ్ సింగ్ తాను రాసిన సూసైడ్ లెటర్‌లో కేంద్రం తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, బాధను తెలియజేసేందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘రైతుల్లో బాధను చూస్తున్నా. వారి హక్కుల కోసం రైతులు పోరాడుతున్నారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయడం లేదు. వారి బాధను నేను పంచుకుంటున్నా. అన్యాయం చేయడం పాపం. అన్యాయాన్ని ఉపేక్షించడం కూడా పాపం. రైతులకు మద్దతు పలికేందుకు కొందరు అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. నేను నన్ను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నా.’ అని ఆ సూసైడ్ లేఖలో బాబా రామ్ సింగ్ పేర్కొన్నారు.

బాబా రామ్ సింగ్ గన్‌తో కాల్చుకున్న విషయం తెలిసిన వెంటనే ఆయన్ను పానిపట్‌లోని పార్క్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని కర్నాల్‌కు తరలించారు.

‘ కర్నాల్‌కు చెందిన సంత్ బాబా రామ్ సింగ్ రైతుల ఉద్యమం సందర్భంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చాలా మంది రైతులు త్యాగాలు చేశారు. మోదీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది. వారితో క్రూరంగా వ్యవహరిస్తోంది. మొండితనం వీడి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయండి.’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు బాబా రామ్ సింగ్ మరణం తీవ్రంగా కలచి వేసిందని, ఆయన మరణం వృధా పోవొద్దని అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ బాదల్ ట్వీట్ చేశారు. వెంటనే కేంద్రం మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రైతు సంఘాలతో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరపాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రతిష్టంభనను తొలగించడానికి రైతలు, ప్రభుత్వ ప్రతినిధులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రైతుల చేస్తున్న ఆందోళన దేశ ప్రయోజనాలకు సంబంధించినదని..సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

First published:

Tags: Farmers Protest, New Agriculture Acts

ఉత్తమ కథలు