Deep Sidhu: ఢిల్లీలో హింస, ఎర్రకోట ముట్టడి వెనక హీరో దీప్ సిద్దు హస్తం..!

దీప్ సిద్దు

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో దీప్ సిద్దు గతంలో దిగిన ఫొటోలను విపక్షాలు వైరల్ చేస్తున్నాయి. హింసాత్మక ఘటనల బీజేపీ హస్తముందని.. రైతులకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు

  • Share this:
    రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో హింసాత్మక ఘటన జరగడం సంచలనగా మారింది. ఎర్రకోట ముట్టడి  ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశమయింది. ఐతే దీని వెనక ప్రముఖ పంజాబీ నటుడు దీప్ సిద్దు హస్తమున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులను నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ఉందని సంయుక్త్ కిసాన్  మోర్చా నేతలు తెలిపారు. సోమవారం రాత్రి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని.. ఆయన వల్లే ఎర్రకోటను ఆందోళనకారులు ముట్టడించారని ఆరోపిస్తున్నారు. దీప్ సిద్దుతో తమకు సంబంధం లేదని.. ఆయన ఎందుకు ఇలా చేశాడో అర్ధం కావడం లేదని తెలిపారు. దీనిక వెనక ఏదో కుట్ర ఉందని.. రైతుల ఆందోళనలను నీరు గార్చేందుకే హింసకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు.

    రైతు సంఘాల నుంచి విమర్శలు రావడంతో నిన్నటి ఘటనపై దీప్ సిద్దు స్పందించారు. ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ ప్లాగ్‌ను మాత్రమే ఎగురవేశామని తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని తొలగించలేదని, ఖాళీ పోస్ట్‌పైనే జెండాలు ఎగురవేశామని చెప్పారు. నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

    మరోవైపు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో దీప్ సిద్దు గతంలో దిగిన ఫొటోలను విపక్షాలు వైరల్ చేస్తున్నాయి. హింసాత్మక ఘటనల బీజేపీ హస్తముందని.. రైతులకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు



    కాగా, గుర్దాస్‌పూర్ ఎంపీ, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌కు దీప్ సిద్దు అత్యంత సన్నహితుడు. ఎన్నికల సమయంలో ఆయన ప్రచారానికి దీప్ సిద్దే ఇంచార్జిగా ఉన్నారు. ఐతే గత డిసెంబరు నుంచి దీప్‌ సిద్దుకు సన్నీ డియోల్ దూరంగా ఉంటున్నారు. రైతు సంఘాలు సైతం ఆయన్ను దూరంగా ఉంచాయి. ఇక విపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ, అమిత్ షాతో ఫొటోలు దిగినంత మాత్రాన.. వారిని అనుమానించడం కరెక్ట్ కాదని మండిపడుతున్నాయి. సినీ నటులు ఎంతో మంది ఫొటోలు దిగుతారని.. ఆ ఫొటోల ఆధారంగా విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: