Home /News /national /

FARMERS PROTEST POLICE USE TEAR GAS WATER CANNONS AS PROTESTING FARMERS BREAK BARRICADES PELT STONES SK

Farmers Protest: రైతులపై పోలీసుల ఉక్కుపాదం.. రాళ్లు విసిరి.. బారికేడ్లు పడేసి..

రైతులపై వాటర్ కెనాన్‌ల ప్రయోగం

రైతులపై వాటర్ కెనాన్‌ల ప్రయోగం

రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రైతులపై ఉక్కుపాదం మోపుతారా.. అని విరుచుకుపడ్డారు.

    ఢిల్లీ శివారులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం రణరంగంగా మారింది. పంజాబ్, హరియాణాల నుంచి పెద్ద తరలివచ్చిన రైతులు ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఐతే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రైతులను ఢిల్లీలోకి అనుమతించలేదు పోలీసులు. ఢిల్లీ సరిహద్దులోని శంభు నదిపై పాటియాల-అంబాలా హైవేపై వారిని అడ్డుకున్నారు. ఐనప్పటికీ ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. పోలీసులపై ఆగ్రహంతో రాళ్లు విసిరారు. బారికేడ్లను ఎత్తి బ్రిడ్జి మీది నుంచి నదిలోకి పడేశారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లను ప్రయోగించారు.


    రైతుల ఆందోళన హర్యానా నుంచి ఢిల్లీ వచ్చే మార్గాల్లో పోలీస్ బలగాలు భారీగా మోహరించారు. సోనిపట్ వద్ద సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ శివారులో రైతులు ఆందోళన నేపథ్యంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ తలెత్తింది. ఢిల్లీ-నోయిడా సరిహద్దులోనూ పోలీసులు తనిఖీలు చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.


    రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రైతులపై ఉక్కుపాదం మోపుతారా.. అని విరుచుకుపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని.. కానీ వాటిని వెనక్కి తీసుకోకుండా రైతులపైనే దాడులు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. శాంతియుత ఆందోళనలు చేయడం రైతుల హక్కు అని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం. కాగా, ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయన్న విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Arvind Kejriwal, Delhi, Farmers Protest

    తదుపరి వార్తలు